ముల్తానీ మట్టితో చర్మానికి ఎంత మేలో తెలుసా?

ముల్తానీ మట్టికి చర్మాన్ని పూర్తిగా శుద్ధి చేసే శక్తి ఉంది. చర్మంపై ఉన్న మురికిని శుభ్రంగా వదిలించేస్తుంది. దీంతో ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, గంధంచెక్క పొడితో కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని మెడపై ప

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (12:24 IST)
ముల్తానీ మట్టికి చర్మాన్ని పూర్తిగా శుద్ధి చేసే శక్తి ఉంది. చర్మంపై ఉన్న మురికిని శుభ్రంగా వదిలించేస్తుంది. దీంతో ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, గంధంచెక్క పొడితో కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని మెడపై ప్యాక్‌లా వేసుకుంటే నల్లదనం తగ్గిపోతుంది.వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
జిడ్డు చర్మం గల వారికి తరచుగా మొటిమలు వస్తుంటాయి. అందుకే జిడ్డు చర్మం గల వారు ముల్తానీ మట్టి రెండు చెంచాలు, ఒక చెంచాడు టమాటా జ్యూస్, పావు చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె అన్నీ కలిపి ముఖంపై ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.  
 
అలాగే కమలా లేదా నారింజ పండ్ల తొక్కల పొడి, ముల్తానీ మట్టిని సమాన భాగాలుగా తీసుకుని రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. జిడ్డు చర్మం నుంచి ఉపశమనం లభిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ చర్మం ముడతలు పడుతుంది. అలాంటి వారు ముల్తానీ మట్టి సాయం తీసుకోవచ్చు. 
 
ఒక టేబుల్ స్పూను ముల్తానీ మట్టి అంతే మొత్తం పెరుగుతో కలుపుకోవాలి. పెరుగు లేకపోతే నీరు వాడుకోవచ్చు. ఓ గుడ్డులోని తెల్లసొనను తీసుకుని ఈ మిశ్రమంతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ముఖం, ముడతలు కనిపించే చోట ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముడతలకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మోహన్ బాబు - మంచు విష్ణులపై కేసు నమోదు

నా ఫోన్ నెంబరునే బ్లాక్ చేస్తావా? ప్రియుడి పొట్టలో కత్తితో పొడిచిన ప్రియురాలు

త్రీ సిస్టర్స్ సూసైడ్ కేసు : కొరియన్ గేమ్ చివరి టాస్క్ ఆత్మహత్యనా?

Rahul Gandhi: నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శరీరం చెప్పే ప్రతి మాటనూ అందరూ వినాలి : చిరంజీవి

Regina Cassandra: వీడియోగ్రాఫర్ కు రెజీనా కాసండ్ర క్లాస్ తీసుకుంది

Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

తర్వాతి కథనం
Show comments