Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఫర్ పీపుల్ హు మూవ్' అనే సరికొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించిన మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2023 (22:25 IST)
ఈ క్యాంపెయిన్ ఆయా ఫీల్డ్‌లలోని ఉన్న నిజమైన గేమ్-ఛేంజర్‌లను హైలెట్ చేస్తుంది. అంటే వారు వచ్చే సమయానికి ఉన్న యథాతథ స్థితి ఒప్పుకోకుండా కొత్త మార్గాన్ని అన్వేషిస్తారు. ఇంకా చెప్పాలంటే పాత సంప్రదాయాలను పక్కన పెట్టి తమదైన శైలిలో సరికొత్త  సంప్రదాయాలను సృష్టిస్తారు. వారి ప్రతీ అడుగులో విజయం యొక్క సారాంశాన్ని సరికొత్తగా ఉంటుంది. అలాంటి వారిలో నటుడు అఖిల్ అక్కినేని, సెలబ్రిటీ వెల్‌నెస్ నిపుణుడు అన్షుక పర్వాణి, ఎడిటర్-ఇన్-చీఫ్ నందిని భల్లా, సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్, స్టార్టప్ వ్యవస్థాపకుడు వేదాంత్ లాంబా ఉన్నారు.
 
యూకే బేస్డ్ ఫుట్ వేర్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది ఫిట్ ఫ్లాప్. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన పాదరక్షలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. అలాంటి బ్రాండ్ ఇప్పుడు 'ఫర్ పీపుల్ హూ మూవ్' పేరుతో సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం సరికొత్త చరిత్రను లిఖించే వ్యక్తుల యొక్క జీవితాలను ప్రతిబింబిస్తుంది. సరిహద్దులను చెరిపేసి, వారి యొక్క సంకల్పంతో విజయాలను సాధించిన వారిని ప్రేరేపిస్తుంది. విజయాన్ని సాధించాలన్న కసితో పనిచేసే వారు నిరంతర అన్వేషణలో, నిరంతరం కదలికలో ఉండే వారికి ఫిట్‌ఫ్లాప్ సరైన పాదరక్షల ఎంపిక అని ప్రచారం చూపిస్తుంది.
 
ఈ సరికొత్త క్యాంపెయిన్‌లో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. అఖిల్ అక్కినేని, వారసత్వాంగా వచ్చిన నటనను మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. భారతదేశంలోని ప్రసిద్ధ ఫ్యాషన్ మ్యాగజైన్‌లో ఎడిటర్-ఇన్-చీఫ్‌గా పనిచేస్తూ ఫ్యాషన్ పరిశ్రమను ప్రగతిశీల దిశలో నడిపించిన వారు నందిని భల్లా. సంపాదకీయాలు, సంభాషణల కోసం తన జీవితాన్ని పునర్నిర్మించిన ప్రముఖ వెల్‌నెస్ నిపుణురాలు అన్షుక పర్వాణి. సాధారణ క్షణాలను కూడా అత్యంత అసాధారణమైన జ్ఞాపకాలుగా మార్చడంలో నైపుణ్యం ఉన్న ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్. ఫైనల్‌గా స్నీకర్ స్పేస్‌లో వ్యాపారాన్ని స్థాపించిన స్టార్టప్ వ్యవస్థాపకుడు వేదాంత్ లాంబా. వీరంతా బ్రాండ్ యొక్క తాజా సేకరణ నుండి బహుముఖ శైలులను కలిగి ఉన్నారు.
 
“‘ఫర్ పీపుల్ హూ మూవ్’ క్యాంపెయిన్ ద్వారా ప్రపంచాన్ని అసాధారణ మార్గాల్లో ముందుకు నడిపించి, సరిహద్దులను చెరిపేసిన ఐకాన్‌ల కథలను వివరించాలనుకుంటున్నాము. ఈ క్యాంపెయిన్ ప్రజలను కదిలించడానికి, వారికున్న పరిమితులను సవాలు చేయడానికి, కొత్త మార్గాలను రూపొందించడానికి స్ఫూర్తినిస్తుందని మేము ఆశిస్తున్నాము. మీరు ధైర్యంగా తెర వెనుకకు వెళ్లినా, అన్ని అసమానతలను ధిక్కరించినా, ముఖ్యమైన సంభాషణలను నడిపించినా లేదా వారసత్వాన్ని కాపాడుకున్నా, ఫిట్ ఫ్లాప్ మీకు సౌకర్యాన్ని, శైలిని సజావుగా మిళితం చేసే పాదరక్షలను అందిస్తుంది. ఫిట్ ఫ్లాప్ ఫుట్‌వేర్ రేంజ్ ఫ్యాషన్ ఫార్వర్డ్ మాత్రమే కాకుండా నిరంతరం శ్రమించే వారికి సౌకర్యాన్ని అందించేందుకు రూపొందించబడింది అని అన్నారు మెట్రో బ్రాండ్స్ లిమిటెడ్‌ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ దీపికా దీప్తి.
 
క్యాండిడ్ కెమెరా మూవ్ మెంట్స్ ద్వారా, వీక్షకులను వారి జీవితాల్లో ముందుంచే ఈ ప్రచారం స్ఫూర్తిదాయకమైన కథనాలను గుర్తించింది. ఫిట్ ఫ్లాప్ డైనమిక్ గో-గెటర్‌లకు మద్దతుగా నిలుస్తుంది. దీని ప్రత్యేకమైన సాంకేతికత, సౌకర్యం, వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. ఈ ఐదుగురు వ్యక్తులలో ప్రతి ఒక్కరు తమ సంబంధిత డొమైన్‌లలో విభిన్న కోణాలను వెలుగులోకి తెస్తూ, బ్రాండ్ యొక్క ప్రాథమిక నైతికతకు ప్రాణం పోశారు.
 
ఫిట్ ఫ్లాప్ ప్రపంచ స్థాయిలో అందరూ ఇష్టపడే విభిన్నమైన ఫుట్ వేర్ కలెక్షన్‌ను అందిస్తుంది. స్టేట్‌మెంట్ శాండల్స్ నుంచి క్లాసిక్ వైట్ ట్రైనర్‌లు, బ్యాలెట్ ఫ్లాట్‌లు, బీచ్ ఫ్లిప్-ఫ్లాప్‌లు, ఈజీ స్లయిడర్‌లు, రోజువారీ షూల వరకు, ప్రతి ఫిట్‌ఫ్లాప్ స్టైల్ వినియోగదారుని శక్తివంతం చేయడానికి, ప్రతిరోజు తమ అత్యుత్తమ పనితీరును కనబరచడానికి మూడు స్థాయిల టార్గెట్ కుషనింగ్‌తో కూడిన అల్ట్రా-కంఫర్టబుల్ అండర్ ఫుట్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తర్వాతి కథనం
Show comments