Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చర్మానికి దోసకాయతో ప్రయోజనాలు.. ట్రీ-ఆయిల్‌ కలిపి ఇలా చేస్తే..?

చర్మానికి దోసకాయతో ప్రయోజనాలు.. ట్రీ-ఆయిల్‌ కలిపి ఇలా చేస్తే..?
, సోమవారం, 28 ఆగస్టు 2023 (10:33 IST)
చర్మానికి దోసకాయ ఎంతో మేలు చేస్తుంది. దోసకాయ జ్యూస్ ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని తేమగా వుంచుతుంది. దోసకాయలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. డెడ్ స్కిన్ సెల్స్, ఆయిల్ స్కిన్ చర్మ రంద్రాలను మూసుకుపోయేలా చేస్తాయి దోసకాయలు చర్మాన్ని శుభ్రపరచడంలో.. చర్మపు రంధ్రాలను బిగించడంలో సహాయపడతాయి.
 
వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల చర్మాన్ని క్లియర్ చేస్తుంది. చాలావరకు మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.  దోసకాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్మాన్ని మృదువుగా వుంచుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. కీటకాల కాటు, వడదెబ్బలు, దద్దుర్లను దూరం చేస్తుంది. 
 
కాలుష్యం కారణంగా ఏర్పడే అస్థిర అణువులు.. చర్మ కణాలకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి డీఎన్ఏని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ చర్మ క్యాన్సర్‌కు కూడా కారణమవుతున్నాయి. దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. దోసకాయ చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. కీరదోసకాయను ఉపయోగించడం వల్ల చర్మంలోని రంధ్రాలు మూసుకుపోతాయి.
 
ముఖం చర్మం శరీరంలోని ఇతర భాగాల కంటే మృదువైనది కాబట్టి దోసకాయ ముఖానికి అదనపు ప్రయోజనాన్ని అందిస్తుంది. దోసకాయ సిలికా, అధిక నీటి కంటెంట్ కారణంగా ముఖాన్ని తాజాగా, మెరుస్తూ ఉండటానికి సహాయపడుతుంది. దోసకాయ ముక్కలను కళ్లపై ఉపయోగించడం వల్ల ఉబ్బరం తగ్గుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు మాయమవుతాయి. దోసకాయలు, పొటాషియం, విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వల్ల ముఖానికి పోషణ, తేమను అందిస్తాయి.
 
దోసకాయతో ఫేస్ మాస్క్ 
కావలసినవి: దోసకాయ, టీ ట్రీ ఆయిల్
తయారీ:
దోసకాయ రసంలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి, వాటిని బ్లెండ్ చేసి ముఖానికి మాస్క్‌ని సిద్ధం చేయండి.
మాస్క్‌ని ముఖం అంతా అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు వుంచాలి. 
ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.
ఈ మాస్క్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల చర్మంపై చికాకు తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవిశ గింజలతో చక్కెర వ్యాధికి చెక్