వర్షాకాలంలో అనేక చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇందుకు వేప, కర్పూరం భేష్‌గా పనిచేస్తుంది. వర్షాకాలంలో గజ్జి, తామర వంటి వ్యాధులు ఇబ్బంది పెట్టవచ్చు. అంతే కాకుండా ఈ సీజన్‌లో మొటిమలు, పొక్కులు, దద్దుర్లు కూడా వస్తాయి. అలాగే, వర్షాకాలంలో పురుగుల కాటు దురద, మంట ఏర్పడవచ్చు. ఇందుకు వేప, కర్పూరం ఉపయోగించవచ్చు.
ఈ రెండింటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉండటమే కాకుండా మచ్చలను కూడా తగ్గిస్తాయి. ఇందుకు ఏం చేయాలంటే... వేప, కర్పూరాన్ని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసి క్రమం తప్పకుండా ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి.
వర్షాకాలంలో, చర్మంపై దురదను తగ్గించడానికి వేప, కర్పూరం నూనెను తయారు చేసి చర్మానికి ఉపయోగించవచ్చు. ఇందుకోసం.. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి వేప ఆకులను ఉడికించాలి. ఈ నూనెను చర్మానికి అప్లై చేస్తే దురదలు, చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఇంకా కర్పూరాన్ని గ్రైండ్ చేసి యూకలిప్టస్ ఆయిల్‌లో కలిపి కూడా చర్మంపై ఏర్పడే మంటను తొలగించుకోవచ్చు.