ఎండాకాలంలో మేకప్ చెరిగిపోతోందా.. అయితే ఇలా చేయండి..

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (17:54 IST)
శీతాకాలం పోయి ఎండాకాలం వచ్చేసింది. ఇంకా ఏప్రిల్ నెల కూడా మొదలవక ముందే ఎండలు భగభగమంటున్నాయి. ఇక స్నానం చేసినంత సేపు కూడా ఫ్రెష్‌గా ఉండటం లేదు. పది నిమిషాలకే చెమటతో ఒళ్లంతా తడిసిపోతోంది.


ఎండాకాలం కాబట్టి మేకప్ వేసుకున్నా చెమట వలన పూర్తిగా పోతుంది లేదంటే ముఖంపై ప్యాచ్‌లుగా కనిపిస్తుందని చాలామంది ఎండాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ శుభకార్యాలు ఎక్కువగా జరిగే సీజన్ కాబట్టి వేసుకోక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు క్రింది జాగ్రత్తలు తీసుకుంటే మేకప్ ఎక్కువ సమయం చెరిగిపోకుండా మీ అందాన్ని ఇనుమడింపజేస్తుంది.
 
మేకప్‌కి ముందు క్లెన్సర్‌తో శుభ్రంగా ముఖాన్ని తుడుచుకుని, ఆపై ఎండాకాలం కాబట్టి మిగతా సీజన్లలో మాదిరిగా కాకుండా లైట్ మేకప్ వేసుకోవాలి. జిడ్డు చర్మం గలవారు మేకప్‌కు ముందు ఆయిల్ ఫ్రీ ప్రైమర్‌ను రాసుకుంటే చెమట పట్టినా కూడా ముఖంపై తెల్లని ప్యాచ్‌లు కనిపించవు. ఎండలో తిరిగినా కూడా చెరిగిపోకుండా ఉండేందుకు కంటికి వేసే మేకప్‌లో అన్నీ వాటర్ ప్రూఫ్ ప్రాడక్ట్స్‌ను వాడాలి. 
 
ఈ సీజన్‌లో ముందుగా పెదాలకు లిప్ బామ్ రాసి, ఆ తర్వాత లిప్‌స్టిక్‌కు బదులుగా లిప్ గ్లాస్ వేసుకుంటే మంచిది. ఎలాగూ చర్మ సంరక్షణ కోసం సన్ స్క్రీన్ లోషన్‌లు ఉండనే ఉన్నాయి. బయటికి వెళ్లేటప్పుడు వాటిని రాసుకోండి. ఈ లోషన్‌లో ఫౌండేషన్ క్రీమ్‌ను కలిపి అరగంట ముందు రాసుకుంటే ఎండ వేడిమిగా మేకప్ చెరిగిపోకుండా ఎక్కువకాలం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mega GHMC Final: ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్.. 12జోన్లు, 60 సర్కిళ్లు

కూల్చివేతలు.. పేల్చివేతులు... ఎగవేతల్లో రేవంత్ సర్కారు బిజీ : కేటీఆర్

Drunk And Drive: హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభం

Greater Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు బాబు గ్రీన్ సిగ్నల్

పిల్లలకు స్పైడర్ మ్యాన్‌లు కాదు... పురాణ ఇతిహాసాలు చెప్పాలి : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: 2025 సంవత్సరం నా జీవితంలో చాలా ప్రత్యేకం.. సమంత

ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

తర్వాతి కథనం
Show comments