Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయ్యితో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి..?

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (11:06 IST)
నెయ్యి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి అంతే మేలు చేస్తుంది. నెయ్యిలోని ఖనిజ లవణాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. నెయ్యి చర్మానికి మంచి ప్యాక్‌లా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై గల మృతుకణాలను తొలగిస్తాయి. అంతేకాదు.. విటమిన్ ఇ నెయ్యిలో అధిక మోతాదులో ఉంది. ఇది మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ ప్రయోజనాలున్న నెయ్యితో ఫేస్‌ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దాం..
 
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి దానికి తోడుగా కొద్దిగా నిమ్మరసం, పసుపు వేసి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు అలానే ఉంచుకోవాలి. ఆపై చల్లని నీటితో కడుక్కుంటే.. ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా.. మృదువుగా తయారవుతుంది. 
 
స్పూన్ నెయ్యిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉండాలి. తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడుసార్లు చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దీంతో చర్మం కొత్త నిగారింపు పొందుతుంది.
 
కంటి అలసటకు చెక్ పెట్టాలంటే.. నెయ్యిలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా కంటి కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన కంటి అలసట తగ్గడమే కాకుండా.. నల్లటి వలయాలు కూడా పోతాయి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments