Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం టీ తాగితే ఏంటి.? ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
మంగళవారం, 22 జనవరి 2019 (10:42 IST)
కొందరైతే ఉదయాన్నే లేవగానే టీ తాగుతుంటారు. రోజంతా పనిచేసి అలసిపోయిన వారికి ఉదయాన్నే లేచి కప్పు టీ తాగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్తుంటారు. ఈ చలికాలంలో చలిగాలి కారణంగా శరీరం మరింత అలసట అనిపిస్తుంది. అలాంటప్పుడు కప్పు టీ తీసుకుంటే.. చాలు. సాధారణంగా టీ అంటే.. ప్రతీ ఒక్కరూ తయారుచేసే విధంగా.. పాలు అందులోకి టీ పొడి, చక్కెర ఉపయోగిస్తారు. ఈ విధానం కంటే.. మరికొన్ని రకాల టీలు ఎలా తయారుచేయాలో వాటిని తీసుకోవడం వలన కలిగే లాభాలు ఓసారి తెలుసుకుందాం..
 
బాదం టీ:
కావలసిన పదార్థాలు.. టీ పొడి, బాదం పప్పులు, పాలు, నిమ్మరసం, చక్కెర.
ఎలా చేయాలో చూద్దాం.. ముందుగా నీటిని వేడిచేసి అందులో సన్నగా తరిగిన బాదం పప్పులు వేసి మరిగించాలి. ఆపై టీ పొడి, పాలు పోసి ఓ 10 నిమిషాల పాటు మరిగించి.. తరువాత అందులో చక్కెర, తేనె లేదా నిమ్మరసం కలిపి తాగితే.. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టీ తీసుకోవడం వలన తలనొప్పి తగ్గడమే కాకుండా.. రోజంతా ఎనర్జీగా ఉంటారు.
 
దాల్చిన చెక్క టీ:
కావలసిన పదార్థాలు.. దాల్చిన చెక్క, అల్లం, బ్లాక్ టీ ఆకులు, నిమ్మ, పుదీనా ఆకులు.
ఎలా చేయాలంటే.. ముందుగా ఓ గిన్నెలో 3 కప్పుల నీరు పోసి బాగా మరిగించి.. ఆపై దాల్చిన చెక్క పొడి, అల్లం పేస్టే, టీ ఆకులు వేసి మరికాసేపు బాగా మరిగించుకోవాలి. చివరగా నిమ్మరసం కలిపి పుదీనా ఆకులు పైన చల్లి తీసుకుంటే.. ఎంతో రుచిగా ఉంటుంది. 
 
ఈ టీ తాగడం వలన శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. దాంతో పాటు చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బయటదొరికే మందులు, మాత్రలు వాడడం కంటే వంటింటిలోని ఈ పదార్థాలతో టీ చేసుకుని తాగితే చాలు. ఎలాంటి వ్యాధులనైన తొలగించవచ్చును. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments