Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి కింద నల్లని వలయాలు పోగొట్టే మార్గాలు

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (12:57 IST)
కంటి కింద నల్లని వలయాలు ముఖ సౌందర్యానికి ఇబ్బందిగా మారుతాయి. ఈ వలయాలను పోగొట్టేందుకు సహజపద్ధతిలో చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. బాదం పప్పును నానబెట్టి వాటిని మెత్తటి పేస్టులా చేసుకుని అందులో కొద్దిగా పచ్చి బంగాళాదుంప తురుము కలిపి కంటి కింద రాసుకుంటే వలయాలు తగ్గుతాయి. బాదం నూనెతో కంటి చుట్టూ మర్దన చేసుకుంటే కంటి కింద వలయాలు సమస్య అదుపులో ఉంటుంది.
 
కళ్ల కింద ముడతలు ఉంటే ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగ్‌లను 15 నిమషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. కీరదోసకాయ ముక్కలను 10 నిమిషాలు పాటు కళ్లపై ఉంచుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు పోతాయి. పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసి ఆ మిశ్రంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని కళ్ల కింద రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేయాలి.
 
టమోటా జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, కీరదోస రసం కలుపుకుని కళ్ల కింద నల్లటి వలయాలకు రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. కాటన్‌తో చల్లని నీళ్లు లేదా పాలను తడిపి దాన్ని కంటి కింద వలయాలపై వత్తి తీసేస్తూ వుండాలి. ఐస్‌క్యూబ్స్ పెట్టి కాసేపు మర్దన చేస్తుంటే కూడా కంటి కింద వలయాలు క్రమేణా కనుమరుగవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

కుమార్తెకు అత్తింటి వేధింపులు... చూడలేక తండ్రి ఆత్మహత్య

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

3 సినిమాతో తన కెరీర్ ముదనష్టం అయ్యిందంటున్న శ్రుతి హాసన్

ఆయనెవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంట.. పొద్దు తిరుగుడు పువ్వు అంట..? (video)

సంధ్య థియేటర్ తొక్కిసలాట : అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా

సీఎం రేవంత్‌తో చర్చించని విషయాలను కూడా రాస్తున్నారు : దిల్ రాజు

Raha: అలియా భట్‌ను మించిపోయిన రాహా.. క్యూట్‌గా హాయ్ చెప్తూ.. (వీడియో వైరల్)

తర్వాతి కథనం
Show comments