పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించి చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. పెరుగుతో ముఖ సౌందర్యానికి పెంచుకోవచ్చు.
పసుపును పెరుగుతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుగవుతుంది. పెరుగు, దోసకాయను కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ పొడిబారడం తగ్గుతుంది. పెరుగులో టమాటా గుజ్జును కలిపి కూడా ముఖానికి రాసుకోవచ్చు.
అలాగే పెరుగులో నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమలు, మచ్చలు, నలుపుదనం తగ్గి చర్మం రంగు మెరుగుపడుతుంది.
పెరుగులో గోధుమపిండిని కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.