Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిడ్డు చర్మం కలవారు ఈ చిట్కాలు పాటిస్తే మెరుపుదనం...

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (21:40 IST)
సాధారణంగా జిడ్డు చర్మం కలవారు ఎంత అందంగా తయారయినా కొద్దిగా చెమట పట్టగానే ముఖం నునుపుదనం తగ్గిపోతుంది. ఇలాంటి వారు కొన్ని చిట్కాలను పాటించి ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. గింజలు తీసివేసిన టమోటా గుజ్జు పావు కప్పు, కీరదోస గుజ్జు ఒక టీస్పూను, ఓట్ మీల్ పొడి నాలుగు టీస్పూన్లు, పుదీనా మిశ్రమం ఒక టీస్పూను తీసుకుని బాగా కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా తరచూ చేయడం వలన చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కాంతివంతంగా అవుతుంది.
 
2. ఒక టీస్పూను తేనెకు గుడ్డులోని తెల్ల సొన, రెండు స్పూన్లు గ్లిజరిన్, కొద్దిగా శనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పదిహేను నిమిషముల తరువాత కడిగేయాలి. అలాగే అరకప్పు పుల్లని పెరుగును ముఖ చర్మానికి రాసుకుని సున్నితంగా మర్దనా చేయాలి. ఇరవై నిమిషముల తరువాత వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖ చర్మం మృదువుగా మారుతుంది.
 
3. తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. అరకప్పు ద్రాక్షాపండ్లు గుజ్జుకు మూడు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీ స్పూను యాపిల్ గుజ్జు, పావుకప్పు గుడ్డులోని తెల్లసొన కలపాలి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments