Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదాలు మృదువుగా కనిపించాలా... కాస్త ఉప్పు, నిమ్మరసం...

పాదాలు మృదువుగా ఉండాలంటే రాత్రివేళ నిద్రకు ఉపక్రమించేందుకు ముందుగా వేడినీటితో కాస్త ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి 5 లేదా 10 నిమిషాల పాటు పాదలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆ

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (12:04 IST)
పాదాలు మృదువుగా ఉండాలంటే రాత్రివేళ నిద్రకు ఉపక్రమించేందుకు ముందుగా వేడినీటితో కాస్త ఉప్పు, నిమ్మరసం, షాంపు వేసి 5 లేదా 10 నిమిషాల పాటు పాదలను నానబెట్టాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు రోజులు చేయాలి. ఆ తరువాత పాదాలను పొడిబట్టతో తుడిచి వేడిచేసిన నువ్వుల నూనెను రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి.
 
గోధుమ పిండిలో కొద్దిగా వెన్నను కలిపి మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే మెడభాగంలో ఉండే నల్లటి వలయాలు తొలగిపోయి మెడ అందంగా కనిపిస్తుంది. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోవాలంటే కీరదోస, బంగాళాదుంప సమానంగా తీసుకుని పేస్టులా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం కోమలంగా మారుతుంది.
 
తేలికగా ఉండే ఒక తెలుపు రంగు కాటన్‌ను పన్నీరులో ముంచి దాన్ని కంటిపై పెట్టుకోవాలి. దానిపై రుబ్బిన బంగాళాదుంప, కీరదోస పేస్ట్‌ను రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments