Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యోగాసనాలు వేస్తున్నారా.. అయితే దివ్యమైన శక్తిని...

ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉన్నది, అదే యోగాసనం. ఇది మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా శరీరం లోలోపలికి తీసుకుంటుంది. మీరు యోగాచేసేటపుడు ఎంతవీలైన అంత నిదానంగా, నెమ్మదిగా శ్వాస ఎక్కువగా తీసుకుంటే అంత మంచి

యోగాసనాలు వేస్తున్నారా.. అయితే దివ్యమైన శక్తిని...
, సోమవారం, 11 జూన్ 2018 (14:59 IST)
ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉన్నది, అదే యోగాసనం. ఇది మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా శరీరం లోలోపలికి తీసుకుంటుంది. మీరు యోగాచేసేటపుడు ఎంతవీలైన అంత నిదానంగా, నెమ్మదిగా శ్వాస ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలా తీసుకోవడం వలన మీరు అద్భుతమైన శక్తిని పొందవచ్చును. గాలి శరీరంలోపల ఉండగానే శ్వాసను బిగబట్టుకుని ఎంత వీలవుతుందో అంత ఎక్కువసేపు యోగా చేయాలి. 
 
మీలోని బలహీనతను, అనారోగ్యాన్ని సంపూర్ణంగా బయటకు వదిలేస్తున్నారనే భావం చెందుతుంటే దీర్ఘంగా ఉన్నశ్వాసను బయటకు నెమ్మదిగా వదిలేయాలి. గాలిని విడిచిపెట్టిన తరువాత శ్వాశ బిగపట్టాలి. అప్పుడే ప్రాణాయామం చేసేందుకు మంచిగా ఉపయోగపడుతుంది. 5 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి.  
ఇలా చేయడం దివ్యశక్తిని పొందగలుగుతారు. 
 
ఈ ప్రాణాయామం మరొక 5 నిమిషాల పాటు చేయడం వలన శరీరంలో ప్రవేశిస్తున్న ఈ దివ్యశక్తి తరంగాలను చేరుకుంటుంది. మీ శరీరంలో, మనస్సులో, ఆలోచనలు కదులుతున్న దివ్యత్వాలా అనుభూతిని చెందాలి. ధ్యానం చేస్తూ బయట ఉన్న విశ్వశక్తిని గమనించాలి. ఇలా చేయడం వలన ఆలోచనలు, టెన్షన్ నుంచి బయటపడి ప్రశాంత స్థితిని చేరుకుంటారు. ఆ ప్రశాంతమైన స్థితిలోనే దివ్యమైన శక్తిని పొందుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యోగాసనాలు వేసేముందుగా తీసుకోవలసిన జాగ్రత్తలు.....