వీర్య కణాల నాణ్యత లోపం... పిల్లలు కలగడంలేదా? యోగాతో సాధ్యం
ఆధునిక జీవనశైలి, ఒత్తిడి మూలంగా పలువురు దంపతుల్లో సంతాన సమస్యలు అనారోగ్యకర సంతానంతో బాధపడుతున్నారు. దీనికి ప్రధానం కారణం వీర్యకణాల్లో నాణ్యత లెకపోవడం. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు ఎయిమ్స్ పరిశోధకులు. రోజూ యోగా చేసే అలవాటు ఉంటే వీర్యకణాల్లో
ఆధునిక జీవనశైలి, ఒత్తిడి మూలంగా పలువురు దంపతుల్లో సంతాన సమస్యలు అనారోగ్యకర సంతానంతో బాధపడుతున్నారు. దీనికి ప్రధానం కారణం వీర్యకణాల్లో నాణ్యత లెకపోవడం. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు ఎయిమ్స్ పరిశోధకులు. రోజూ యోగా చేసే అలవాటు ఉంటే వీర్యకణాల్లో నాణ్యత మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు. ఒక్కోసారి శుక్రకణాల్లోని డీఎన్ఏ దెబ్బతినడం మూలంగా సంతానం సమస్యలు తలెత్తుతుంటాయి.
పిల్లల్లో జన్యుపరమైన వ్యాధులు పలు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. డీఎన్ఏ దెబ్బతినడానికి ఆక్సీకరణ ఒత్తిడే ప్రధానం కారణంగా వైద్యులు చెపుతుంటారు. వాతావరణం కాలుష్యం, ఆహారపు అలవాట్లు, రేడియో ధార్మికత, మద్యపానం, పొగత్రాగడం మూలంగా శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్ మధ్య సమతౌల్యం దెబ్బతిని దీని మూలంగా వీర్య కణాల్లో నాణ్యత దెబ్బతింటుంది.
రోజూ యోగా చేయడం మూలంగా జీవన శైలిలో స్వల్ప మార్పులు చేసుకోవడంతో ఈ సమస్యను అధిగమించొచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. దీనిలో 200 మంది పురుషులు పాల్గొన్నారు. వీరిని ఆరు నెలలపాటు యోగా చేయమని సూచించారు. అనంతరం జరిపిన పరీక్షల్లో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలో యోగా తోడ్పడుతోందని, వీర్యకణాల్లో నాణ్యతను ఇది మెరుగుపరుస్తోందని తేలింది.