పుదీనా పేస్ట్, టమోటా గుజ్జుతో నల్లటి వలయాలు..?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (11:36 IST)
పుదీనాతో అందం ఎలా పొందాలంటే.. పుదీనా ఆకులను పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి రోజంతా ఫ్రిజ్‌లో పెట్టి మరునాడు ఉదయాన్నే పుదీనా మిశ్రమంలో దూదిని ముంచి కళ్ల కొంద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి.
 
పుదీనా మిశ్రంలో బంగాళాదుంప రసం, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. మెుటిమలు, నల్లటి మచ్చల వలన ముఖం ముడతలుగా మారుతుంది. అందుకు ఇలా చేస్తే... పుదీనా మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
గంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా పేస్ట్‌లో కొద్దిగా టమోటా గుజ్జు, ఉప్పు, నిమ్మరసం కలిపి కంటి కింద రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దాంతో కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం మృదువుగా, తెల్లగా మారుతుంది. 
 
పుదీనా మిశ్రమంలో కొద్దిగా శెనగపిండి, పసుపు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. దాంతో రక్తప్రసరణ కూడా సాఫిగా జరుగుతుంది. పుదీనా అందానికే కాదు.. ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్ అగ్ర నాయకులను హతమార్చాల్సిందే : ట్రంప్‌కు నెతన్యాహు పిలుపు

ఇరాన్ పైన యుద్ధం చేయమన్నది మీరే కదా పీట్: రక్షణ మంత్రిని ఇరికించిన ట్రంప్

కొలంబియాలో కూలిన హెర్క్యులస్ విమానం.. 66 మంది మృతి (video)

హైదరాబాదులో ఇంధనం లేదా ఎల్పీజీ కొరత లేదు.. సజ్జనార్

చెన్నై-హౌరా రైలు కింద పడి ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'బాక్సాఫీస్ కా బాప్' ఆదిత్య ధర్ : 'ధురంధర్‌' మూవీపై రజనీకాంత్ ప్రశంసలు

బాబీ కొల్లి మెగాస్టార్ చిరంజీవి నటించే 158వ చిత్రం

బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ఆవిష్కరణ : రూ.761 కోట్లు దాటిన 'ధురంధర్ : ది రివెంజ్'

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

తర్వాతి కథనం
Show comments