Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెక్కిళ్లు నిలిచిపోవాలంటే.. 30 సెకన్ల పాటు అలా చేయండి..

Advertiesment
వెక్కిళ్లు నిలిచిపోవాలంటే.. 30 సెకన్ల పాటు అలా చేయండి..
, గురువారం, 25 అక్టోబరు 2018 (18:02 IST)
వెక్కిళ్లు టక్కున ఆగిపోవాలంటే.. ఈ టిప్స్ పాటించాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. అవేంటంటే? 
 
వెక్కిళ్లు ఆగిపోవాలంటే.. 30 సెకన్ల పాటు చెవులను చేతి వేళ్లతో గట్టిగా మూసేస్తే సరిపోతుంది. 
* అరస్పూన్ పంచదారను నోట్లో వేసుకుని కాసేపు నాలుకపై వుంచినా వెక్కిళ్లు దూరమవుతాయి.  
* నాలుగు లేదా ఐదు సార్లు గట్టిగా ఊపిరి పీల్చుకుని నెమ్మదిగా వదిలితే వెక్కిళ్లు ఆగిపోతాయి.  
 
మరికొన్ని బ్యూటీ టిప్స్
* స్నానం చేసే నీటిలో అర కప్పు టమోటా జ్యూస్ చేర్చి స్నానం చేస్తే చెమట వాసన దూరమవుతుంది.  
* నిమ్మరసంలో కాస్త ఉప్పు చేర్చి.. సేవిస్తే లేదంటే.. వేడినీటిలో ఉప్పు చేర్చి నోటిని పుక్కిలిస్తే నోటి దుర్వాసన దూరమవుతుంది. 
 
* కలబంద రసంలో కొబ్బరినూనెను చేర్చి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలదు. జుట్టు వత్తుగా పెరుగుతాయి. 
* నాలుగు తమలపాకులు, మూడు మిరియాలను నమిలి మింగితే.. తలభారం దూరమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొటిమలు నివారించేందుకు 4 మార్గాలు...