కొబ్బరినూనె, వేపనూనెలతో చుండ్రు మటాష్

చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, వేపనూనెను ఉపయోగించండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. కొబ్బ‌రినూనె, వేప నూనెల‌ను మిక్స్ చేసి.. ఆ నూనెను స్నానానికి ముందు తలకు పట్టించి పది లేదా 20 నిమిషాల తర్

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2017 (08:14 IST)
చుండ్రును తొలగించుకోవాలంటే.. కొబ్బరినూనె, వేపనూనెను ఉపయోగించండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. కొబ్బ‌రినూనె, వేప నూనెల‌ను మిక్స్ చేసి.. ఆ నూనెను స్నానానికి ముందు తలకు పట్టించి పది లేదా 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చుండ్రును దూరం చేసుకోవచ్చు. దీంతో చుండ్రు పోవ‌డ‌మే కాదు, జుట్టుకు పోష‌ణ అందుతుంది. త‌ద్వారా శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి కూడా. 
 
కొబ్బ‌రినూనె, ఆముదంల‌ను కొద్దిగా స‌మ‌పాళ్ల‌లో తీసుకుని స‌న్న‌ని మంట‌పై వేడి చేయాలి. అనంత‌రం చ‌ల్లారాక ఆ నూనెను వెంట్రుక‌ల‌కు రాయాలి. ఇలా వారంలో 3, 4 సార్లు చేస్తే ఫ‌లితం ఉంటుంది చుండ్రు తొలగిపోతుంది. ఇంకా వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించి చల్లారాక ఆ నీటిని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు నుంచి ఉపశమనం కలుగుతుంది.  
 
తులసి ఆకులు, ఉసిరి కాయ‌ల‌ను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకి పట్టించి మృదువుగా మర్దనా చేయాలి. ఒక గంటసేపు అలానే వదిలేసి ఆ తర్వాత కడిగేయాలి. దీంతో స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అదేవిధంగా కలబంద గుజ్జుతో జుట్టుకు మర్దనా చేసి 15 నిమిషాల పాటు అలానే వుంచి గోరువెచ్చని నీటిలో స్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హనీమూన్‌కు వెళ్లొచ్చిన దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పిల్లుల్లా బంకర్లలో దాక్కున్నారు : పాక్ అధ్యక్షుడు జర్దారీ (Video)

ఏపీకి రూ.9470 కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టులు : కేంద్రం వెల్లడి

బంగ్లాదేశ్‌లో ఆటవిక రాజ్యం... హిందువులను చంపేస్తున్న అరాచక మూకలు

కర్నాటకలో నిరుపేదల ఇళ్లపై బుల్‌డోజర్... సీఎం సిద్ధూ ఫైర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ద్వాదశ జ్యోతిర్లాంగాల దర్శనం పూర్తి చేసుకున్న కంగనా రనౌత్

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడుగా డి.సురేష్ బాబు

తలైవర్‌తో లవ్ స్టోరీ తీయాలన్నదే నా కల : సుధా కొంగరా

అభిమానులకు కోసం సినిమాలకు స్వస్తి : హీరో విజయ్ ప్రకటన

డార్లింగ్ ఫ్యాన్స్‌కు మంచి వినోదం ఇవ్వాలనే "రాజాసాబ్" చేశాం... ప్రభాస్

తర్వాతి కథనం
Show comments