Webdunia - Bharat's app for daily news and videos

Install App

రింగు రింగుల శిరోజాలను కాపాడుకునే బ్యూటీ టిప్స్

చాలా మందికి రింగు రింగుల వెంట్రుకలు ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. అయితే, ఇలాంటి జట్టును కాపాడుకునేందుకు వారు చాలా శ్రమిస్తుంటారు. నిజానికి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఇలాంటి జ

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (14:25 IST)
చాలా మందికి రింగు రింగుల వెంట్రుకలు ఉంటాయి. ఇవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. అయితే, ఇలాంటి జట్టును కాపాడుకునేందుకు వారు చాలా శ్రమిస్తుంటారు. నిజానికి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే ఇలాంటి జట్టును సులభంగా రక్షించుకోవచ్చని సౌందర్య నిపుణులు చెపుతున్నారు.
 
స్నానం చేసిన తర్వాత జుట్టుని సహజంగా గాలికి ఆరనివ్వాలి. డ్రయ్యర్‌ని వాడితే జుట్టు విరిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల దానికి దూరంగా ఉండటం ఎంతో మంచిది. జుట్టు మరీ గట్టిగా రింగులు తిరిగిపోకుండా ఉండాలంటే యాంటీ ఫ్రిజ్ సిరమ్‌ని వాడితే సరిపోతుంది. ఈ సిరమ్‌ని జుట్టు కుదుళ్ల నుంచి రాయాలి. గట్టిగా ఉన్న రింగుల జుట్టుపై మరింత బలప్రయోగం చేయకుండా కొంత వరకూ పొడవు తగ్గించుకుంటే మంచింది.
 
సాధారణ జుట్టు కంటే రింగుల జుట్టు వాతావరణ మార్పులకు వెంటనే ప్రభావితమవుతుంది కాబట్టి, రింగుల జుట్టు ఉన్నవారు మరింత శ్రద్ధ తీసుకోవాలి. అందుకనే షాంపూతో వారానికోసారైనా తప్పకుండా తల స్నానం చేయడం మంచిది. దానివల్ల చర్మం జిడ్డులేకుండా ఉంటుంది.
 
మాయిశ్చరైజింగ్ షాంపూ అయితే జుట్టుని పొడిగా ఉంచడానికి తోడ్పడుతుంది. వారంలో వీలైనన్ని సార్లు షాంపూతో తలస్నానం చేసినా జుట్టు జిడ్డు లేకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది. షాంపూ వాడని రోజుల్లో జుట్టుని వేడి నీటితో కడగాలి. దీనివల్ల పోషణ ఇచ్చే సహజ నూనె పదార్థాలు కోల్పోకుండా జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.
 
ఆల్కహాల్ కలిగి ఉన్న ఉత్పాదనలను వాడటం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. అందువవల్ల రింగుల జుట్టు ఉన్న వారు ఆల్కహాల్ ఉన్న ఉత్పాదనలను వాడకుండా ఉండటం మంచిది. రింగుల జుట్టుని మరింత ఆకర్షణీయంగా మార్చుకోవాలంటే నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments