క్యాలరీలు తగ్గించుకోవడానికి కొబ్బరినూనెను వాడితే...
వంటల్లో కొబ్బరి నూనెను వేసి చేసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వును కొబ్బరి నూనె పూర్తిగా కరిగిస్తుంది. ఇది కుదరని పక్షంలో ఆలివ్ నూనెను తీసుకుంటే మంచిది. అలాకాకుంటే నువ్వులనూనెను తీసుకోవడం వలన బరువును తగ్
వంటల్లో కొబ్బరి నూనెను వేసి చేసుకోవడం వలన శరీరంలో ఉండే కొవ్వును కొబ్బరి నూనె పూర్తిగా కరిగిస్తుంది. ఇది కుదరని పక్షంలో ఆలివ్ నూనెను తీసుకుంటే మంచిది. అలాకాకుంటే నువ్వులనూనెను తీసుకోవడం వలన బరువును తగ్గించుకోవచ్చును. మెదడు పనితీరును మెరుగుపరచుటకు కొబ్బరి నూనె ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
కొబ్బరినూనె జీర్ణక్రియకు చాలా మంచిది. మెదడు సంబంధిత రుగ్మతలను దూరంచేసేందుకు సహాయపడుతుంది. ఒబిసిటీ సమస్యనుండి కపాడుతుంది. కొబ్బరినూనె కేలరీలను కరిగిస్తుంది. కానీ హృద్రోగ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నూనెను వాడకపోవడం మంచిది.
కొబ్బరినూనెను వంటల్లో వాడటం వలన కేశసంరక్షణకు తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొడిబారిన చర్మానికి తేమనిస్తుంది. కొబ్బరి నూనెతో నోటిని పుక్కిలిస్తే బ్యాక్టీరియాలను నోటి నుంచి తొలగించుకోవచ్చును. తద్వారా దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన కూడా తొలగిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
రోజు పాటించే ఆహార ప్రణాళికలలో కొబ్బరి నూనెను వాడటం వలన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలుగరాదు. క్యాలరీలు తగ్గించుటకు ఉపయోగపడుతుంది. కాలిన గాయలకు కొబ్బరినూనెను రాసుకుంటే మంచిది. కొబ్బరినూనె ఎండ నుంచి సంరక్షిస్తుంది. బయటికి వెళ్లే ముందుగా కొద్దిగా కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే అతినీలలోహిత కిరణాల నుంచి ముఖానికి సంరక్షణ లభిస్తుంది.