Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి ఆకుల గుజ్జులో కొద్దిగా తేనె కలిపి..?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (11:24 IST)
స్త్రీలు అందంగా ఉండాలని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాలు కొందరికి సెట్ అవుతాయి మరికొందరికి సెట్‌కావు. మరి సెట్‌కాని వారి పరిస్థితి ఏంటి..? అందుకు ఏం చేయాలి..? కోమలమైన చర్మాన్ని పొందాలంటే.. చర్మకాంతిని రెట్టింపు చేయాలంటే.. కొన్ని సౌందర్య చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..
 
స్పూన్ మొక్కజొన్న పిండిలో అరస్పూన్ పెరుగు, స్పూన్ బియ్యం పిండి, స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాలు పాటు అలానే ఉండి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమంగా చేస్తే.. ముఖం చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
 
పావుకప్పు తులసి ఆకుల గుజ్జులో కొద్దిగా తేనె, పచ్చిపాలు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి ఆపై గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేయడం వలన చర్మం అందం రెట్టింపవుతుంది. 
 
ఒక బౌల్‌లో టమోటా జ్యూస్, క్యారెట్ జ్యూస్, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత చల్ల చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా ఇల్లు బఫర్‍‌జోన్‌లో ఉందా... హైడ్రా కమిషనర్ క్లారిటీ!!

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments