Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళల కోసం బ్యూటీ టిప్స్.. ఆరెంజ్ జ్యూస్‌లో నెయ్యి కలిపి పెదవులపై రాస్తే?

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (22:39 IST)
మహిళలు అందం పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ అందాన్ని పెంచుకునేందుకు బ్యూటీపార్లర్లకు వెళుతుంటారు. అయితే చాలా డబ్బు ఖర్చు చేయడమే కాకుండా, కెమికల్ క్రీమ్‌లు కూడా ముఖంపై అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి. కాబట్టి, ఇంట్లో ఉండే వస్తువులతో ఎప్పటికీ అందంగా ఉండాలంటే ఇలా చేయండి. 
 
గోళ్లను కత్తిరించే ముందు నూనె రాసుకుని, కాసేపటి తర్వాత గోళ్లను కత్తిరించుకుంటే నచ్చిన ఆకృతిలో గోళ్లు కత్తిరించి అందంగా కనిపిస్తాయి. జుట్టు మరీ జిడ్డుగా ఉంటే కోడి గుడ్డులో కొంచెం పంచదార కలిపి తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు తొలగిపోయి జుట్టు అందంగా తయారవుతుంది. 
 
అలాగే అలోవెరా జెల్‌ను కళ్ల కింద నల్లటి వలయాలపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. ఇలా 10 రోజుల పాటు చేస్తే నల్లటి వలయాలు పోతాయి. ఆరెంజ్ జ్యూస్‌లో నెయ్యి కలిపి పెదవులపై రాస్తే పగిలిన పెదాలు మృదువుగా మారుతాయి.
 
పండిన అరటిపండును మెత్తగా చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. టొమాటో లేదా యాపిల్ తురుమును ముఖానికి రాసుకుంటే చర్మం జిడ్డు తగ్గుతుంది. బొప్పాయి పండును గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె, పాలు కలిపి ముఖానికి రాసుకుని కాసేపు నానబెట్టి ముఖం కడుక్కుంటే ముఖం మెరిసిపోతుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments