Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీగడలో చక్కెర కలిపి ఇలా చేస్తే..?

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (10:37 IST)
పాలలో వచ్చే మీగడ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ, చాలామంది మీగడను తినకుండా పారేస్తుంటారు. మీగడలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఇంకా చెప్పాలంటే.. ముడతల చర్మాన్ని తొలగించుటలో మీగడ ముఖ్య ప్రాత పోషిస్తుంది. దీనిలోని ప్రయోజనాలు చూస్తే.. తప్పక మీగడను పారేయకుండా ఉపయోగిస్తారని చెప్తున్నారు నిపుణులు.
 
1. మీగడలోని విటమిన్ సి ముఖంపై గల నల్లటి మచ్చలు, మెుటిమలను తొలగిస్తాయి. ఎలాగంటే.. మీగడలో కొద్దిగా చక్కెర, కలబంద గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో చర్మంపై గల మృతుకణాలు పోతాయి. 
 
2. కొందరికి కంటి కింద నల్లటి వలయాలు విపరీతంగా ఉంటాయి. వాటిని తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఎలాంటి లాభాలు కనిపించవు... అందుకు మీగడ దివ్యౌషధంగా పనిచేస్తుంది. పావుకప్పు మీగడలో కొద్దిగా కీరదోస రసం, ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు క్రమంగా చేస్తే కంటి నల్లటి వలయాలు పోతాయి. 
 
3. మీగడలోని ప్రోటీన్ల్ మృతుకణాలను తొలగిస్తాయి. దీనిలోని లాక్టికి యాసిడ్ చర్మంపై గల దుమ్ము, ధూళి నుండి ఉపశమనం కలిగిస్తాయి. రోజూ స్నానానికి ముందుగా కప్పు మీగడలో కొద్దిగా నిమ్మరసం, పసుపు, గంధం కలిపి పేస్ట్‌లా చేసుకుని శరీరానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే.. చర్మం తాజాగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments