Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజ్‌వాటర్, కీరదోస రసాన్ని ముఖానికి రాసుకుంటే..?

ఫ్రిజ్‌లో ఉంచిన రోజ్‌వాటర్‌, కీరదోసకాయ రసం కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్రతి రోజు రాత్రి పట్టించుకుంటే ముఖంపై జిడ్డు తొలగిపోతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవడానికి కాటన్‌ ట్యాబ్‌ వాడాలి. లేకు

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (11:39 IST)
ఫ్రిజ్‌లో ఉంచిన రోజ్‌వాటర్‌, కీరదోసకాయ రసం కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్రతి రోజు రాత్రి పట్టించుకుంటే ముఖంపై జిడ్డు తొలగిపోతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవడానికి కాటన్‌ ట్యాబ్‌ వాడాలి. లేకుంటే చిన్నపాటి కాటన్ క్లాత్ అయినా పర్లేదు. 
 
అలాగే చర్మం నిగనిగలాడాలంటే.. ఒక కప్పు పెరుగులో బియ్యం పిండి, తగినన్ని బాదం పలుకులు వేసి ఓ పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని రాత్రి నిద్రపోయేముందు రాసుకుని.. పొద్దున్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది.
 
అలాగే ఓట్స్‌ తినడానికే కాదు, ముఖ వర్ఛస్సు పెంచుకోవడానికి ఇవి పనిచేస్తాయి. ఓట్స్‌, తేనె, కోడి గుడ్డు సొన, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించి, నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మఛాయను మెరుగుపడుతుంది. 
 
చర్మంపై ఏర్పడే నల్లవలయాలు, మచ్చలు పోవాలంటే.. అరకప్పు పసుపు పొడి, నాలుగో వంతు రోజ్‌ వాటర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ గంధం పొడి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 30 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలని బ్యూటీషియన్లు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

తర్వాతి కథనం
Show comments