Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్‌ని స్ప్రే చేస్తే...

గులాబి చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. గులాబీని ఇష్టపడని వారుండరు. గులాబి అందాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గులాబీలను సౌందర్య సాధనంగా మరియు వంటకాల్లో సైతం వాడుతారు. ఇందులో విటమిన్ ఎ, బి3 లతో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంద

Advertiesment
Rose water health benefits
, గురువారం, 14 జూన్ 2018 (19:00 IST)
గులాబి చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. గులాబీని ఇష్టపడని వారుండరు. గులాబి అందాన్ని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. గులాబీలను సౌందర్య సాధనంగా మరియు వంటకాల్లో సైతం వాడుతారు. ఇందులో విటమిన్ ఎ, బి3 లతో పాటు విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా ఐరన్, క్యాల్షియం, జింక్‌ను కూడా కలిగి ఉంది. ఇంకా ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం....
 
1. గులాబీ నీరు(రోజ్ వాటర్) ఒక టేబుల్ స్పూన్, పసుపు అర టీస్పూన్ తీసుకుని బాగా కలిపి వడకట్టి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుని కంటి ఎరుపుదనం, కళ్ల కలక లాంటి సమస్య ఉన్నప్పుడు రోజుకు మూడుసార్లు ఒక్కో కంట్లో రెండు చుక్కలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా కంటి మంట, కంటి దురద, కంటి అలర్జీలు కూడా తగ్గుతాయి.
 
2. గులాబీ రేకులను తరచూ తీసుకోవడం ద్వారా రక్తశుద్ది జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
 
3. గులాబీ రేకులు చర్మానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఇది చర్మంలోని ఆయిల్‌ని కంట్రోల్ చేస్తుంది. చర్మానికి మంచి నిగారింపుని ఇస్తుంది. ఇది ఒక మాయశ్చరైజర్‌లా పని చేస్తుంది. రోజ్ వాటర్‌ని చర్మానికి అప్లై చేయడం ద్వారా ఇది చర్మంలోని పి.హెచ్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. 
 
4. డ్యామేజీ అయిన చర్మపు కణాలను తిరిగి ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. చర్మపు కాంతిని పెంచుతుంది. రాత్రి పడుకునే ముందు రోజ్ వాటర్‌ని పిల్లోపై స్ప్రే చేసి పడుకోవడం వలన గాఢమైన మరియు సుదీర్ఘమైన నిద్రను పొందవచ్చు. ఇది ఒత్తిడిని దూరం చేసి ఆహ్లాదకరమైన మూడ్‌ని ఇస్తుంది.
 
5. గులాబీ రేకులను పాలల్లో వేసి మెత్తగా ముద్దలా చేసి ముఖానికి అప్లయి చేయడం ద్వారా మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే దీనిని కంటి చుట్టూ అప్లై చేయడం వల్ల కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీనేజ్‌లో ఏదో తెలియని ఆందోళన... ఇలా చేస్తే...