పచ్చి రొయ్యలు తింటే ఏంటి లాభం?
మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల అవి గుండె రక్త నాళాల్లో పూడిక రాకుండా చూస్
మాంసాహార ప్రియులు పచ్చి రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రొయ్యల్లో ఒమేగా3 ప్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల అవి గుండె రక్త నాళాల్లో పూడిక రాకుండా చూస్తాయి. ఫలితంగా రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. రొయ్యల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల పళ్ళు, ఎముకలు దృఢంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇన్ని పోషక విలువలున్న రొయ్యలు మన ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. చర్మకాంతికి తోడ్పడే విటమిన్ ఇ రొయ్యల్లో ఉంటుంది. ఇది చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది.
2. రొయ్యల్లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. తద్వారా మతిమరుపుని త్వరగా రానివ్వదు. అంతేకాకుండా శరీర నిర్మాణ కణాల అభివృద్ధికి ఉపకరించే శక్తి రొయ్యల్లో ఉంటుంది.
3. రొయ్యల్లోని సెలీనియమ్ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది. రక్త సరఫరాకు అడ్డుపడే కొవ్వును తొలగిస్తుంది.
4. మాంసాహారాలన్నింటిలోకెల్లా రొయ్యల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు రొయ్యలను తినడం ద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.
5. ఒక పెద్ద రొయ్యలో రెండు గ్రాముల కొవ్వు , 30 గ్రాముల ప్రోటీను 125 మిల్లీ గ్రాముల ఖనిజాలు లభిస్తాయి. ఇవి రుచికరంగాఉంటాయి కదా అని నూనె ఎక్కువగా వేసిన వేపుళ్లను తినకూడదు. తక్కువ నూనెతో వండుకుని తినొచ్చు.
6. రొయ్యలంత బలవర్థకమైన ఆహారం మరొకటి లేదని ఓ సర్వేలో తేలింది. అంతేకాకుండా ఇవి త్వరగా జీర్ణమవుతాయి.