అర టీస్పూన్ కొబ్బరినూనె, అర టీస్పూన్ బాదం నూనె కలిపి...

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (21:58 IST)
ఎండలో తిరిగినప్పుడు ముఖచర్మం కాంతివిహీనంగా తయారవుతుంది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి అనేక రకములైన క్రీంలు వాడుతుంటాము. అందువల్ల చర్మం పాడయ్యి అనేక రకములైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాకాకుండా మనకు సహజసిద్దంగా మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్దాలతోనే మన ముఖ చర్మాన్ని కాంతివంతంగా తయారుచేసుకోవచ్చతు. అదెలాగో చూద్దాం.
 
1. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టికి టేబుల్ స్పూన్ పాలు, టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టులా చేయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ పేస్టుని రాసి ఇరవై నిముషాల తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం మీద ఉన్న మచ్చలన్నీ పోయి ఆరోగ్యంగా మెరుస్తుంది.
 
2. టేబుల్ స్పూన్ గంధం పొడిలో అర టీస్పూన్ కొబ్బరినూనె, అర టీస్పూన్ బాదం నూనె, టీస్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తరువాత కడగాలి. లేదా రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖం అంతా సుతిమెత్తగా అద్దాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
3. పసుపు, గంధం కలిపి రాసుకుంటే ముఖానికి అందం, ఆకర్షణ వస్తాయి.
 
4. చందనం, రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకుని ఇరవై నిముషాల తరువాత కడిగివేయాలి. దానివల్ల చర్మం తాజాగా కనపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూలై 2, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుందంటే?

MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments