నారింజ రసం, పాలపొడి ముఖానికి పట్టిస్తే..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (11:17 IST)
చాలామంది అందానికే టైమ్ అంతా వృధా చేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా బ్యూటీపార్లర్‌లోనే కూర్చుని ఉంటారు. ఇలాంటి వారికి ఒక్కోసారి బ్యూటీపార్లర్‌కి వెళ్లే సమయం దొరకనప్పుడు ఇంట్లో లభించే సాధనాలతోనే తేలిగ్గా 10 నిమిషాల్లో తాజాగా కనిపించవచ్చు.. ఎలాగో తెలుసుకుందాం రండీ..
 
సౌందర్య పోషణలో నిమ్మరసం ప్రత్యేకత ఎంతో ఉంది. ముఖంపై నల్లటి మచ్చలు, తెల్లటి మచ్చలను, చర్మరంధ్రాలను తొలగిస్తుంది. మొటిమల నివారణకు నిమ్మ ఎంతో దోహదపడుతుంది. స్పూన్ నిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి. అలానే నిమ్మరసంలో రెండు మూడు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది.
 
ఓ చిన్న టమోటాని తీసుకుని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలతో ముఖాన్ని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత ఓ స్పూన్ నారింజ రసంలో కొద్దిగా పాలపొడి, గంధం, తేనె వేసి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా నిగనిగలాడుతుంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వీధికుక్క కరిస్తే ప్రభుత్వం పరిహారం, రోడ్లపై కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు ఇంటికి తీస్కెళ్లండి

viral video, ఇదిగో ఈ పామే నన్ను కాటేసింది, చొక్కా జిప్ తీసి నాగుపామును బైటకు తీసాడు, ద్యావుడా

డొనాల్డ్ ట్రంప్ నోటిదూల.. ఇరాన్‌లో అల్లకల్లోలం.. నిరసనల్లో 2వేల మంది మృతి

హమ్మయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట.. ఆ కేసులో క్లీన్‌చిట్

ప్రపంచ దేశాలతో ట్రంప్ గిల్లికజ్జాలు, గ్రీన్‌ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు మాస్టర్ ప్లాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

నారీ నారీ నడుమ మురారి టికెట్లు ఎంఆర్‌పీ ధరలకే : నిర్మాత అనిల్ సుంకర

మీకే చెప్పేది, మా ఇద్దర్నీ వీడియో తీయొద్దు: ఫోటోగ్రాఫర్లపై కృతి సనన్ ఆగ్రహం

Maruti: రాజా సాబ్ గా ప్రభాస్ ని కొత్తగా చూపించాననే ప్రశంసలు వస్తున్నాయి : మారుతి

సుమతీ శతకం నుండి అమర్దీప్ చౌదరి డాన్స్ తో తొలి సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments