చాలామందికి ముఖంపై నల్ల మచ్చలు అధికంగా ఉంటాయి. ఈ మచ్చలను తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి ఫలితం కనిపించలేదని బాధపడుతుంటారు. ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో ఇంటి చిట్కాలు పాటించి అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ టిప్స్ అనుసరిస్తే మృదువైన చర్మం మీ సొంతం..
కీరోదసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టితే వచ్చే రసాన్ని తీసుకుని అందులో కొన్ని పాలు కలిపి ముఖానికి, మెడడు అప్లై చేయాలి. ఇలా రోజూ క్రమంగా చేస్తే ముఖంపై గల నల్లచి మచ్చలు, వలయాలు పోతాయి. ప్రతిరోజూ కీరదోస ఫేస్‌ప్యాక్ వేసుకుంటే మొటిమలు, బ్లాక్‌హెడ్స్, ముడతలు వంటి సమస్యలు మీ దరిచేరవు.
బొప్పాయి రసాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ ముఖానికి పట్టిస్తే సూర్యకాంతి వలన చర్మంపై ఏర్పడే గోధుమరంగు మచ్చలు తగ్గిపోతాయి. దాంతో చర్మం మెరిసిపోవాలంటే.. బొప్పాయి గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి వాడాలి.
చర్మం మృదువుగా మారాలంటే.. అరస్పూన్ నిమ్మరసంలో ఓ గుడ్డు తెల్లసొనలో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.