రోజూ బొప్పాయిని తినండి.. ఒబిసిటీని తరిమికొట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణలు. రోజూ ఒకే ఒక్క ముక్క బొప్పాయిని తీసుకుంటే కాలేయ ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అజీర్తి సమస్యలుండవు. రోజూ ఆహారం తీసుకున్న అరగంట ముందు లేదా.. ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు బొప్పాయిని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా తగ్గుతాయి.
ఇంకా బొప్పాయి వేపుడును తీసుకుంటే కూడా ఒబిసిటీతో ఇబ్బందులు వుండవు. అధిక రక్తపోటు కలిగిన వారు.. నెలపాటు రోజూ రెండు బొప్పాయి ముక్కలను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం వుంటుంది. బొప్పాయి పండ్లను చిన్నారులు తీసుకుంటే.. వారిలో పెరుగుదల సులభమవుతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే బొప్పాయి గుజ్జును తేనేతో కలిపితో ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కోమలంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.