Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొప్పాయిని తేనెతో పాటు తింటే...?

Advertiesment
papaya
, గురువారం, 31 జనవరి 2019 (10:19 IST)
బొప్పాయి పండు తీసుకోవడం వలన కలిగే ఫలితాలు ఎన్నో ఉన్నాయి. అన్ని పండ్లు ఆరోగ్యాన్ని ఇస్తే బొప్పాయి మాత్రం ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తుంది. బొప్పాయిలో విటమిన్ సి పోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇందులో కంటికి మేలు చేసే విటమిన్ ఎ కూడా ఉంటుంది. క్యాన్సర్‌ను నిరోధించే లైకోపీస్ కూడా సమృద్దిగా దొరుకుతుంది. బొప్పాయిలో పీచు పదార్ధం ఎక్కువ.
 
బొప్పాయి గుజ్జుని ఫేస్ ప్యాక్‌లా ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా తయారవుతుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. మొటిమల నివారణ, ఆయిల్ ఫేస్ కూడా తగ్గుతుంది. చర్మం పైన ఏర్పడిన మృత కణాలను బొప్పాయి పోగొడుతు౦ది. పచ్చి బొప్పాయి నుండి విటమిన్ సి, ఖనిజ లవణాలు శరీరానికి అందుతాయి. చిన్న పిల్లలకు కడుపు నొప్పి, నులిపురుగులు ఉన్న‌ట్ల‌యితే తరచు బొప్పాయిని తినిపిస్తే నులిపురుగులు పోతాయి. దీనివలన ఆకలి పెరుగుతుంది. రోజూ బొప్పాయిని తేనెతో పాటు తింటే గుండె, మెదడు, కాలేయం, నరాలకు రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. 
 
రోజు బొప్పాయి తినడం వలన రోగనిరోధ‌కశక్తి పెరుగుతుంది. ఊబకాయంతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారు బొప్పాయిని రోజూ తింటే బరువు తగ్గుతారు. బొప్పాయిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. మహిళల్లో సహజంగా ఉండే రుతుక్రమ సమస్యలకు బొప్పాయి చక్కని మందు. గర్భిణులు మాత్రం ఈ పండు తినక పోవడమే మంచిది. బొప్పాయి మంచి పోషక విలువలు ప్రోటీన్స్ కలిగిన ఫలం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిరియాలు శక్తి మీకు తెలిస్తే వాటిని వదిలిపెట్టరు...