Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నూనె వేస్తే బిగుతుగా వున్న చర్మపు ముడతలు పోతాయి

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (23:37 IST)
ఆముదం విరేచనకారిగా, లూబ్రికెంట్‌గా నూనెతో కూడిన ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆముదం విత్తనాల నుంచి తీసే ఈ నూనె చిక్కగా, ఘాటుగా ఉంటుంది. దీనికి బ్యాక్టీరియాను చంపే గుణం కూడా ఉంటుంది. సౌందర్య సాధనాల తయారీతో పాటు ఔషధాల తయారీలో కూడా ఉపయోగించే ఆముదం ప్రయోజనాలు బోలెడన్ని. నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం ఆముదాన్ని విరివిగా వాడతారు. 
 
4 టీ స్ఫూన్ల కొబ్బరి నూనెతో 2 టీ స్ఫూన్ల ఆముదం కలిపి పొట్ట మీద పట్టు వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా చేస్తే ఉదయానికి నులిపురుగులు పోతాయి. ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆముదంలో ముంచిన వస్త్రాన్ని కీళ్ళ మీద ఉంచి ప్లాస్టిక్ పేపరుతో కట్టి, దాని మీద వేడి నీళ్ల బాటిల్ గంట పాటు ఉంచితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. 
 
ఎండ వల్ల కమిలిన చర్మం మామూలుగా తయారవ్వాలంటే ఆ ప్రాంతంలో ఆముదం పూసి గంట తరువాత కడిగేయాలి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి చర్మం మీద అప్లై చేస్తే బిగుతుగా తయారై ముడతలు తగ్గుతాయి. ఆముదంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు చర్మం పైన అప్లై చేస్తే ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెంది మచ్చలు మటుమాయం అవుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments