Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీటిని పారేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (11:24 IST)
ఈ చలికాలం కారణంగా చర్మం పొడిబారుతుంటుంది. దాంతో శరీరమంతా ముడతలుగా మారుతుంది. ఈ సమస్యలను తొలగించుకోవడానికి ఏవేవో మందులు, క్రీములు వాడుతుంటారు. అయినను ఎలాంటి తేడా కనిపించలేదని బాధపడుతుంటారు. బయట దొరికే క్రీమ్స్, ప్యాక్స్ వాడడం కంటే.. ఇంట్లోని ఈ చిన్న పాటి చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు బ్యూటీ నిపుణులు. మరి అవేంటో చూద్దాం..
 
ప్రతిరోజూ ఇంట్లో తప్పకుండా అన్నం తయారుచేస్తారు. కాబట్టి.. ఈ చిట్కా అందానికి చాలా పనిచేస్తుంది. సాధారణంగా ప్రతీ ఇంట్లో బియ్యం కడిగిన నీటిని పారేస్తారు. ఈ నీటి ఉపయోగాలు తెలుసుకుంటే.. ఇలా చేయాలనిపించదు.. అంటే.. బియ్యం కడిగిన నీటిలో 2 స్పూన్ల నిమ్మరసం కలిపి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తే ముడతల చర్మం పోయి.. చర్మం మృదువుగా తయారవుతుంది.
 
బియ్యలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని అందంగా మార్చేలా చేస్తాయి. కనుక బియ్యాన్ని శుభ్రం చేసిన నీటితో ప్యాక్ వేసుకోండి.. తప్పక ఫలితం ఉంటుంది.. పావుకప్పు బియ్యం నీటిలో 2 స్పూన్ల తేనె కలిపి చర్మానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే.. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫ్టెక్స్ రావని కూడా వెల్లచించారు.
 
ఇప్పటి చలికాలంలో చేతులు ముడతలుగా మారుతుంటారు. చేతులు ఇలా ఉన్నప్పుడు చూడడానికే విసుగుగా ఉంటుంది. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారా.. అయితే ఇలా చేయండి.. బియ్యం కడిగిన నీటిలో స్పూన్ నిమ్మరసం, స్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితాలు పొందవచ్చును. ముందున్న చర్మానికంటే.. ఈ ప్యాక్ వేసుకున్న తరువాత చూస్తే మీకే తేడా కనిపిస్తుంది. కనుక తప్పక ఈ చిట్కాలు పాటించండి..   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments