గుమ్మడితో బూరెలా.. ఎలా చేయాలంటే..?

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (10:56 IST)
కావలసిన పదార్థాలు:
తీపి గుమ్మడి తురుము - 1 కప్పు
బెల్లం తురుము - 1 కప్పు
యాలకుల పొడి - 1 స్పూన్
జీడిపప్పు - 1 స్పూన్
నెయ్యి - పావుకప్పు
మినపప్పు - 1 కప్పు
బియ్యం - 2 కప్పులు
ఉప్పు - చిటికెడు
నూనె - సరిపడా.
 
తయారీ విధానం:
ముందుగా మినపప్పు, బియ్యాన్ని కలిపి నాలుగు గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడి తురుమును శుభ్రమైన వస్త్రంలో మూటకట్టి దానిపై బరువు పెట్టాలి. కాసేపటికి అందులో తడి పోతుంది. తరువాత స్టౌవ్ మీద బాణలి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి గుమ్మడి తురుము వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో బెల్లం తురుము వేసి కలుపుకోవాలి. 
 
ఆ తరువాత ఆ మిశ్రమంలో యాలకుల పొడి, జీడిపప్పు పలుకులు కలిపి దించేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ పరిమాణంలో ఉండల్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రుబ్బిపెట్టుకున్న పిండిలో ఉప్పువేసి కలుపుకోవాలి. పూర్ణం ఉండల్ని ఒక్కోటి చొప్పున ఆ పిండిలో దిప్ చేసి నూనెలో వేసి వేయించి తీసుకుంటే.. టేస్టీ టేస్టీ గుమ్మడి బూరెలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వ్యాపారంలో నష్టం, 100 మంది పురుషులతో శృంగారం, డబ్బుకోసం బ్లాక్‌మెయిల్

గోల్కొండ కోట.. గోల్ఫ్ క్లబ్ ప్రాంగణంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభం

రాష్ట్ర ప్రజలకు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో అభివృద్ధి.. ఇజ్రాయేల్‌తో సంతకం చేసిన భారత్

Mysamma Temple: మైసమ్మ ఆలయంలో విధ్వంసం.. అనుమానితుడి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi vanta: అదృష్టం లేదు అందుకే పొట్ట మాడ్చుకుంటున్నానంటున్న మెగాస్టార్ చిరంజీవి

సంక్రాంతి సంబ‌రాల క్యాంపెయిన్‌ను ప్రారంభించిన మంచు మ‌నోజ్‌

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

తర్వాతి కథనం
Show comments