Webdunia - Bharat's app for daily news and videos

Install App

బకెట్‌కు తాడు బదులు తీగ కడితే... చిన్నారి చేయి తెగిపోయింది : ప్రెస్ రివ్యూ

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (14:01 IST)
కడప జిల్లాలో చిన్నపాటి నిర్లక్ష్యం తల్లీబిడ్డలను ప్రమాదంలోకి నెట్టిందంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది. కడప అక్కాయపల్లెకు చెందిన ఫరీదా, సయ్యద్‌ ఆరిపుల్లా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. సయ్యద్‌ ఆరిపుల్లా జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కాయపల్లెలో ఫరీదా, ఆమె పిల్లలు రెండో అంతస్తులో కాపురముంటున్నారు. వీళ్లు ప్రతి రోజు ఇంట్లో పోగైన చెత్తను ప్లాస్టిక్‌ బకెట్‌లో వేసి తాడు సాయంతో కిందకు దించేవారు.

 
ఆదివారం రాత్రి వీరి పెద్ద కుమార్తె అయిషా(13) బకెట్‌కు తాడు బదులు పాత విద్యుత్తు తీగను కట్టింది. విద్యుత్తు తీగకు అక్కడక్కడ అతుకులున్నాయి. వీరు ఉంటున్న ఇంటికి అతి సమీపంలో 11 కేవీ విద్యుత్తు తీగలు వెళుతున్నాయి. బకెట్‌ను కిందకు దించే సమయంలో ప్రమాదవశాత్తూ అతుకులున్న విద్యుత్తు తీగకు 11 కేవీ విద్యుత్తు తీగల నుంచి విద్యుత్తు సరఫరా కావడంతో పాటు అక్కడే ఉన్న స్టీల్‌ స్తంభానికి కూడా విద్యుత్తు సరఫరా అయింది.

 
ఒక్కసారిగా అధిక విద్యుత్తు ప్రసారం కావడంతో అయిషా చెయ్యి తెగి కిందపడింది. తన కుమార్తెను కాపాడేందుకు యత్నించి ఫరీదా కూడా తీవ్రంగా గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments