Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విటర్ సీఈఓ: మంచునీటి స్నానం, ఒంటి పూట భోజనం... సంపద 5 బిలియన్ డాలర్లు

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (13:22 IST)
ట్విటర్ సీఈఓకు గత ఏడాది 1.40 డాలర్ల వేతనం చెల్లించారు. ఉదయం 5 గంటలకే రూం టెంపరేచర్ నుంచి నేరుగా వెళ్లి కరిగిన మంచులాంటి చల్లటి నీళ్లలో దూకగల విల్ పవర్ మీలో ఉంటే.. మీరు ఏదైనా సాధించగలరు. ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ తన అనుభవాల నుంచి చెబుతున్న మాటలివి. రోజూ ఒకే పూట భోంచేస్తాని, వీకెండ్‌లో ఎక్కువగా ఉపవాసం ఉంటానని, 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకు వేగంగా నడుచుకుంటూ వెళ్తానని డోర్సీ ఒక ఫిట్‌నెస్ పాడ్‌కాస్ట్ షోలో చెప్పారు.
 
2015లో ట్విటర్ శాశ్వత సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంతకుముందు ఆ సంస్థలో అత్యున్నత స్థానాల్లో పనిచేశారు. 2006లో ప్రారంభమైన ట్విటర్ వ్యవస్థాపకుల్లో ఆయనా ఒకరు. అంతేకాదు, స్క్వేర్ అనే మొబైల్ పేమెంట్స్ సంస్థకు ఆయనే ఫౌండర్. కానీ తాను చేసిన పనికి వేతనం తీసుకోవడంలో 42 ఏళ్ల ఈ కోటీశ్వరుడి తీరు కూడా ఆయన్ను వార్తల్లో నిలిపింది. పదేళ్లకు పైగా వివిధ స్థాయిల్లో పనిచేసిన ఆయన గత ఏడాది తొలిసారి వేతనం తీసుకున్నారు. అది కూడా కేవలం 1.40 డాలర్లు.
 
42 ఏళ్ల డోర్సీ సంపద 5 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ అంచనా
జీతం తీసుకోకుండా ఎలా..
అంతమాత్రాన ట్విటర్ సీఈఓకు డబ్బుల సమస్య ఉంటుందని అనుకోవద్దు. ఆయనకు ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 500 కోట్ల డాలర్లకు పైగా సంపద ఉంది. 2009లో స్థాపించిన మొబైల్ పేమెంట్ సంస్థ స్క్వేర్‌లో షేర్ల ద్వారా ఆయన లాభాలు సంపాదించారు. నెలకు 30 కోట్లకు పైగా యూజర్లుండే ట్విటర్ ఆదాయం 2018 చివరి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో 909 మిలియన్ డాలర్లకు చేరింది. వీడియో ప్రకటనలలో 24 శాతం పెరుగుదల వచ్చింది.
 
"ట్విటర్‌కు దీర్ఘకాలిక విలువను సృష్టించాలన్న తన నిబద్ధతకు, నమ్మకానికి విలువిచ్చిన మా సీఈఓ జాక్ డోర్సీ 2015 నుంచి 2017కు వరకూ తనకు వచ్చే అన్ని ప్రయోజనాలు, పరిహారాలూ తిరస్కరించారు. 2018లో ఆయన ఈ 1.40 డాలర్లు మినహా మిగతా ప్రయోజనాలేవీ వద్దన్నారు" అని ఆ కంపెనీ తెలిపింది. సిలికాన్ వాలీలో నామమాత్రం వేతనానికి పనిచేస్తున్న పారిశ్రామికవేత్త ట్విటర్ సీఈఓ ఒక్కరే కాదు. మార్గ్ జుకర్ బర్గ్(ఫేస్‌బుక్ ), లారీ పేజ్(గూగుల్) కూడా ఏడాదికి ఒక డాలర్ వేతనం మాత్రమే తీసుకుంటున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్ ఏడాదికి 81, 840 డాలర్ల వేతనం అందుకుంటున్నారు. 1998 నుంచి ఆయన అంత మొత్తమే తీసుకుంటున్నారు.
 
ట్విటర్ షేర్లలో డోర్సీకి 2.3 శాతం వాటా ఉంది
బిలియనీర్ వారెన్ బఫెట్ కూడా వీరిలాగే తక్కువగా లక్ష డాలర్ల వేతనం తీసుకుంటున్నారు. వీరందరికీ ప్రధాన ఆదాయ వనరు వేతనం మాత్రమే కాదు. డోర్సీకి ట్విటర్‌లో 2.3 శాతం షేర్ ఉంది. గత ఏడాది స్క్వేర్‌లో 1.7 శాతం షేర్స్ అమ్మడం వల్ల ఆయనకు 8 కోట్ల డాలర్లు వచ్చాయని ఫోర్బ్స్ పేర్కొంది. ఆయనకు స్క్వేర్‌లో 6 కోట్ల షేర్లు ఉన్నాయి. వాటి విలువ 2015లో 9 డాలర్లు ఉండగా ఇప్పుడది 75 డాలర్లకు పెరిగింది. లావాదేవీలపై ఆయన వసూలు చేసే 2.75 శాతానికి తగ్గట్టు సింబాలిక్‌గా ఆయన జీతం కూడా 2.75 డాలర్లు ఉంది.
 
అసాధారణ దినచర్య
సిలికాన్ వాలీలో ఉండే సీఈఓల మధ్య పోలికలు అక్కడితో ఆగిపోవు. శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండడానికి డోర్సీ దినచర్య చాలా అసాధారణంగా ఉంటుంది. బెన్ గ్రీన్‌ఫోల్డ్ ఫిట్‌నెస్ పాడ్‌కాస్ట్‌తో మాట్లాడిన ఆయన "వేకువజామునే లేస్తానని, చల్లటి నీటిలో మూడు నిమిషాలు స్నానం చేస్తానని, తర్వాత 104 సెంటీగ్రేడ్ ఆవిరిలో 15 నిమిషాలు ఉంటానని, గంటపాటు ధ్యానం చేస్తానని, ఇలా 20 ఏళ్లుగా చేస్తున్నానని" చెప్పారు. గత ఏడాది మయన్మార్ నుంచి తిరిగొచ్చిన తర్వాత తను పాటించిన వాటి ప్రయోజనాల గురించి డోర్సీ ట్వీట్ చేశారు.
 
"ఈ పది రోజులూ ఏ పరికరాలూ లేవు. చదవడం, రాయడం, వ్యాయామం, సంగీతం, మత్తుపదార్థాలు, మాంసం, మాట్లాడ్డం, కనీసం వేరేవారితో కళ్లలోకి కూడా చూళ్లేదు" అన్నారు. పాడ్‌కాస్ట్‌ షోలో ఆయన రోజుకు ఒక పూట ఎలా తినేవారన్నది చెప్పారు. "సాయంత్రం 6.30కు ప్రొటీన్, సలాడ్ తీసుకునేవాడ్ని. తర్వాత బెర్రీస్ లేదా డార్క్ చాక్లెట్ తినేవాడ్ని" అన్నారు. ఈ జీవనశైలి తనను పగటిపూట పనిపై మరింత దృష్టి పెట్టేలా చేసిందని, అత్యంత ఒత్తిడితో ఉన్న పనులను కూడా పూర్తి చేయడానికి సిద్ధమయ్యేలా చేసిందని డోర్సీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments