Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కానీ వీరి విడుదల కోసం ప్రజలు ఆందోళన చేస్తున్నారు...

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (15:06 IST)
రష్యా రాజధాని మాస్కోలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గతేడాది జరిగిన ఓ హత్య సంచలనం రేపింది. ముగ్గురు టీనేజ్ యువతులు కలిసి తమ కన్నతండ్రిని హత్య చేశారు. నిద్రిస్తున్న సమయంలో అతడిపై కత్తి, సుత్తితో దాడి చేసి చంపారు.


వారిని ఆ తండ్రి శారీరకంగా, మానసికంగా వేధించేవాడని, అతడి దుశ్చర్యలు కొన్నేళ్లుగా సాగుతున్నాయని ఆ తర్వాత విచారణలో తేలింది. అయితే, ఆ ముగ్గురు యువతులు మాత్రం ఇప్పుడు హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. దీంతో వారి భవితవ్యం రష్యాలో పెద్ద చర్చనీయాంశమైంది. వాళ్లను విడుదల చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. స్థానికులు ఇందుకోసం ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఓ పిటిషన్‌ను కూడా ప్రారంభించారు. దీనిపై 3 లక్షలకుపైగా మంది సంతకాలు చేశారు.

 
గతేడాది జులై 27 సాయంత్రం మిఖాయిల్ ఖచాటర్యన్ (57) తన ముగ్గురు కుమార్తెలు క్రిస్టినా, ఏంజెలినా, మరియాలను ఒకరి తర్వాత ఒకరిని తన గదిలోకి పిలిచాడు. ఇంటిని సరిగ్గా శుభ్రం చేయనందుకు వారిని తిట్టి, ముఖంపై పెప్పర్ స్ప్రే కొట్టాడు. ఆ రోజు రాత్రి అతడు పడుకున్న తర్వాత క్రిస్టినా, ఏంజెలినా, మరియా కత్తి, సుత్తె, పెప్పర్ స్ప్రే తీసుకుని మరోసారి ఆ గదికి వెళ్లారు. మిఖాయిల్ తల, మెడ, ఛాతీపై వాటితో దాడి చేశారు. అతడి శరీరంపై 30కి పైగా కత్తి పోట్లు ఉన్నాయి.

 
ఈ హత్య చేసిన తర్వాత, ఘటన గురించి ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని వారి ఇంట్లోనే పోలీసులు అరెస్టు చేశారు. అప్పటికి వారి వయసు 17 నుంచి 19 ఏళ్ల మధ్యే. ఆ తర్వాత పోలీసులు జరిపిన విచారణలో మిఖాయిల్ గురించి కొన్ని విషయాలు వెలుగుచూశాయి. కుమార్తెలను అతడు మూడేళ్లుగా హింసిస్తున్నట్లు తేలింది. వాళ్లను ఖైదీల్లా బంధించి పెట్టి, లైంగికంగానూ వేధించినట్లు వెల్లడైంది.

 
రష్యాలో గృహ హింస బాధితులకు రక్షణ కల్పించే చట్టాలేవీ లేవు. గృహ హింస ఘటనలను పోలీసులు పెద్దగా పట్టించుకోరు. వాటిని కుటుంబ అంతర్గత వ్యవహారాల్లా చూస్తారు. గతంలో మిఖాయిల్ తన భార్య ఆరెలియా డండక్‌ను కూడా వేధించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు. అతడి ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండేవారు కూడా కొన్నిసార్లు ఫిర్యాదులు చేశారు. అయితే, వీటిపై పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

 
ఈ హత్య జరిగేటప్పటికి మిఖాయిల్‌కు ఆరెలియా దూరంగా, విడిగా ఉంటున్నారు. కుమార్తెలకు ఆమెతో సంబంధాలు లేకుండా మిఖాయిల్ చేశాడు. ఆ యువతులు చాలా కాలంగా వారి ఇంట్లో బంధీలుగా ఉన్నారని, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని వారిని పరీక్షించిన సైకాలజిస్టులు చెప్పారు.

 
ఈ కేసు విచారణ చాలా నెమ్మదిగా సాగింది. ఆ ముగ్గురు యువతులపై అధికారులు ఆంక్షలు విధించారు. విలేఖరులతో గానీ, వాళ్లలో వాళ్లు గానీ మాట్లాడే అవకాశం వారికి ఇవ్వలేదు. గత్యంతరం లేని పరిస్థితుల వల్లే ఆ ముగ్గురు యువతులు తండ్రిని హత్య చేశారని, వారిని నేరస్థుల్లా కాకుండా బాధితుల్లా చూడాలని మానవహక్కుల ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు.
 

ఆత్మరక్షణలో భాగంగా ఆ ముగ్గురు యువతులు ఈ హత్య చేశారని వారి న్యాయవాదులు వాదిస్తున్నారు. విచారణలో వారి తండ్రి వేధింపుల గురించిన ఆధారాలు వెల్లడైనందున, వారిని విడుదల చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని విచారణాధికారులు అంటున్నారు. రష్యాలో ఆత్మరక్షణ కోసం చేసే నేరాలకు శిక్ష నుంచి మినహాయింపులు ఉంటాయి. ఒకవేళ దోషులుగా తేలితే మాత్రం ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments