Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్‌గ్రిడ్‌లో రూ.2000 కోట్ల స్కామ్‌

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (14:23 IST)
ఆంధ్ర ప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో రూ.2000 కోట్ల అవినీతి జరిగిందని, చంద్రబాబు ఆధ్వర్యంలోని ఆ శాఖ ఫైలుపై నారా లోకేశ్‌ సంతకం చేయడమే ఇందుకు రుజువని సాక్షి పత్రిక ఒక కథనం రాసింది.

 
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ నిన్న ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారని, ఈ స్కామ్‌లోని పలు అంశాలను అంగీకరించిన ఆయన తర్వాత మాట మార్చారని ఈ కథనం పేర్కొంది.

 
చంద్రబాబు శాఖ ఫైలు మీద లోకేశ్‌ సంతకం వ్యవహారాన్ని హరికృష్ణప్రసాద్‌ ముందు అంగీకరించి తర్వాత మళ్లీ కాదన్నారని ఈ కథనం పేర్కొంది. బహిరంగ మార్కెట్‌లో రూ.2200 కే దొరుకుతున్న సెట్‌టాప్‌బాక్సులను టీడీపీ ప్రభుత్వం అప్పటి ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన కంపెనీ నుంచి రూ.4400 కొన్నదని, ప్రభుత్వ ఖజానాకు దీనివల్ల వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఈ కథనం వెల్లడించింది.

 
ఇంటింటికి ఇంటర్నెట్‌ కోసం చంద్రబాబు ప్రతిష్టాత్మకం ప్రవేశపెట్టిన ఫైబర్‌ గ్రిడ్‌ పథకంలో అనేక అవకతవకలు జరిగాయని సాక్షి పత్రిక తన కథనంలో ఆరోపించింది. అయితే తాను సాంకేతిక సలహాలు మాత్రమే ఇచ్చేవాడినని, ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌ కమిటీలో తానులేనని హరికృష్ణ ప్రసాద్‌ చెప్పినట్లు సాక్షి పేర్కొంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments