Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో నో ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్స్... కానీ జిహాదీలు మాట్లాడుకుంటున్నారు?

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (17:25 IST)
ఫోటో కర్టెసీ- ప్లేస్టోర్
కశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేశారు. మొబైల్ నెట్‌వర్కులు పనిచేయట్లేదు. మరి, కశ్మీర్‌లోని జిహాదీల మధ్య సమాచార మార్పిడి ఎలా జరుగుతోంది? సమాచార వ్యవస్థలను ప్రభుత్వం నిలిపివేయడంతో కశ్మీరీ జిహాదీలు ఇప్పుడు ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్, వైఫైలతో పనిచేసే మొబైల్ యాప్‌లను వినియోగిస్తున్నారు.

 
జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతో కశ్మీర్‌లో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందన్న ఆలోచనతో ముందస్తుగా అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు.

 
మెసేజింగ్ యాప్ టెలీగ్రామ్‌లో జిహాదీలు క్రియాశీలంగా ఉండే కశ్మీర్ అనుకూల జిహాదీ ఛానెళ్లలో ఆగస్టు 4 నుంచి ఎలాంటి సమాచారం పోస్ట్ చేయడంలేదు. దీనిని బట్టి చూస్తే, ఇంటర్నెట్ నిలిపివేత ప్రభావం జిహాదీల సంభాషణలపై పడిందని అర్థమవుతోంది. నిఘావర్గాలకు చిక్కకుండా ఉండేందుకు జిహాదీలు, ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మద్దతుదారులు ఇంటర్నెట్ లేకుండా పనిచేసే ఆఫ్‌లైన్ సోషల్ మీడియా యాప్‌లను వినియోగించేవారు.

 
ఫైర్‌చాట్
'ఫైర్‌చాట్' యాప్‌ మెష్ నెట్‌వర్కింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్‌లకు ఇంటర్నెట్, సర్వర్లు అవసరం. ఈ యాప్‌ల ద్వారా బదిలీ అయ్యే సమాచారమంతా సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. కానీ, ఫైర్‌చాట్ యాప్‌కు కేంద్రీకృత సర్వర్, ఇంటర్నెట్ అవసరం ఉండదు.

 
ఈ యాప్ బ్లూటూత్, వైఫై సిగ్నల్ ద్వారా ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్‌కు.. ఆ ఫోన్ నుంచి ఇంకో ఫోన్‌కు... అలా వందలు, వేల ఫోన్లను అనుసంధానం చేస్తుంది. అలా ఒక నెట్‌వర్క్‌ ఏర్పడుతుంది. ఈ యాప్‌తో తన నెట్‌వర్క్‌లో ఉన్నవారికి టెక్స్ట్ సందేశాలతో పాటు, ఫొటోలను, వీడియోలను కూడా పంపే వీలుంటుంది.

 
ఇంటర్నెట్ లేకుండానే ఇద్దరి నుంచి 10,000 మంది వరకూ గ్రూప్‌ చాట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఈ యాప్. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో అందుబాటులో ఉంది. ఇంటర్నెట్‌ ఉన్నా, లేకున్నా ఈ యాప్ పనిచేస్తుంది. టెలీగ్రామ్ యూజర్లు ఎక్కువగా సిఫార్సు చేసిన యాప్ ఇదే. ఈ యాప్‌ను తైవాన్‌లో, హాంగ్‌కాంగ్‌లో ఆందోళనలు జరిగినప్పుడు నిరసనకారులు ఈ యాప్‌ను వినియోగించేవారు.

 
ఐఎస్‌ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ఇరాక్ ప్రభుత్వం 2014లో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేసింది. అప్పుడు అనేకమంది ఈ ఆఫ్‌లైన్ యాప్‌ను విస్తృతంగా వినియోగించారు. ఓపెన్‌గార్డెన్ అనే సంస్థ 2014లో ఈ యాప్‌ను విడుదల చేసింది. మూడో వ్యక్తికి తెలియకుండా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సమాచారం బట్వాడా అయ్యేలా ఎండ్‌ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఈ యాప్‌లో పొందుపరిచారు.

 
కొంతకాలంగా కశ్మీరీలు 'స్మార్ట్‌మెష్' అనే మరో ఆఫ్‌లైన్ యాప్‌ను కూడా వినియోగిస్తున్నారు. అది కూడా ఇంటర్నెట్, మొబైల్ నెట్‌వర్క్ లేకుండానే పనిచేస్తుంది. ఇలాంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్లతో ఐఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ఆ సంస్థ మద్దతుదారులు చాలాకాలంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఐఎస్ ఎక్కువగా 'రాకెట్‌చాట్' యాప్‌ను వినియోగిస్తుండేది. ఆ యాప్‌లో ఇప్పటికీ ఐఎస్ సానుకూల చానల్స్ ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments