Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలాన్ మస్క్ ట్విటర్‌ టేకోవర్ పూర్తి, తెలుగు ఉద్యోగి విజయ గద్దె, సీఈఓ పరాగ్ అగర్వాల్ తొలగింపు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (15:47 IST)
కర్టెసి-ట్విట్టర్
ట్విటర్‌ను ఎలాన్ మస్క్ పూర్తిగా సొంతం చేసుకున్నారు. 4,400 కోట్ల డాలర్ల ఈ డీల్ పూర్తయినట్లు సంస్థకు చెందిన ఇన్వెస్టర్లలో ఒకరు వెల్లడించారు. ట్విటర్‌ను టేకోవర్ చేసిన వెంటనే మస్క్ ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, లీగల్-పాలసీ-ట్రస్ట్ లీడ్ విజయ గద్దె సహా పలువిభాగాల హెడ్‌లను తొలగించారు. ట్విటర్ ఇన్వెస్టర్ రాస్ గెర్బర్ ఈ విషయాలను 'బీబీసీ'తో చెప్పారు. కాలిఫోర్నియాలోని గెర్బర్ కవసాకీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్.

 
''కోర్టు గడువు మస్క్‌ను తొందరపెట్టిందని భావిస్తున్నాను'' అని గెర్బర్ అన్నారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా ‘పక్షికి స్వేచ్ఛ లభించింది’ అంటూ ట్వీట్ చేశారు. ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సీగల్‌లకు కంపెనీతో అనుబంధం ఇక లేదని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. పరాగ్ అగర్వాల్, సీగల్‌, ట్విటర్ లీగల్-పాలసీ హెడ్ విజయ గద్దెలకు ధన్యవాదాలు చెబుతూ ట్విటర్ కోఫౌండర్ బిజ్ స్టోన్ ట్వీట్ చేశారు. విజయ గద్దెను కూడా కంపెనీ నుంచి తొలగించినట్లు అమెరికా మీడియా తమ కథనాలలో పేర్కొంది.

 
ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో తుది నిర్ణయాలు తీసుకోవడానికి అక్టోబరు 28 వరకు గడువు విధించింది కోర్టు. దీంతో ఎలాన్ మస్క్ ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు ఇటీవలే బ్యాంకర్లతో సమావేశమయ్యారు. తాజాగా ఆయన ట్విటర్ ప్రధాన కార్యాలయానీ వెళ్లి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఒక సింక్‌తో అక్కడికి వెళ్లిన వీడియోను కూడా గురువారం షేర్ చేశారు. మరోవైపు శుక్రవారం ట్విటర్ షేర్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్‌సైట్ వెల్లడించింది. కాగా ట్విటర్ కోసం మస్క్ చెల్లిస్తున్న మొత్తం చాలా ఎక్కువనేది చాలామంది విశ్లేషకుల మాట. అయితే, మస్క్ మాత్రం ఇటీవల ''చాలాకాలంగా నిరర్థకంగా ఉన్న ఆస్తి ట్విటర్. నేను, నా సహ ఇన్వెస్టర్లు ట్విటర్‌కు ప్రస్తుతం ఎక్కువ మొత్తమే చెల్లిస్తుండొచ్చు కానీ దానికి అమూల్యమైన సత్తా ఉంది'' అన్నారు.

 
జనవరిలో షేర్లు కొనడం మొదలు పెట్టి..
మస్క్ ఇంతకుముందు ట్విటర్‌లో పెట్టిన పెట్టుబడి ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. జనవరి నుంచి ఆయన ట్విటర్ షేర్లు క్రమం తప్పకుండా కొనడం ప్రారంభించారు. అలా అలా మార్చి నెల మధ్య నాటికి ఆయన ట్విటర్‌లో 5 శాతం షేర్లు కొనుగోలు చేశారు. ఏప్రిల్ నాటికి ఆయన ట్విటర్‌లో అతి పెద్ద వాటాదారు అని బయటకు తెలిసింది. ఆ నెల చివరి నాటికి 4,400 కోట్ల డాలర్లతో ట్విటర్ కొనుగోలు చేయడానికి మస్క్ ముందుకొచ్చారు. ట్విటర్‌ నుంచి స్పామ్ అకౌంట్లను తొలగించి వాక్‌స్వాతంత్ర్యానికి వేదికగా మారుస్తానని ఆయన చెప్పారు.

 
అయితే, మే నెలలో ఆయన తన మనసు మార్చుకున్నారు. ట్విటర్‌లో ఫేక్ ఖాతాల సంఖ్య ఆ సంస్థ చెబుతున్న కంటే చాలా ఎక్కువగా ఉందని అంటూ ఆయన కొనుగోలు డీల్‌పై వెనక్కు తగ్గారు. ఆ కంపెనీ కొనాలని తనకు ఎంతమాత్రం లేదని జులైలో ఆయన ప్రకటించారు. అయితే, మస్క్ తమ సంస్థను కొనడానికి చట్టబద్ధంగా ఒప్పందం చేసుకున్నారని, దానికి కట్టుబడి ఉండాలంటూ ట్విటర్ కోర్టుకెక్కింది. అక్టోబర్‌లో ఆయన మళ్లీ తన టేకోవర్ ప్లాన్లను ముందుకుసాగించారు.

 
ట్రంప్‌పై ట్విటర్ బ్యాన్‌ను ఇక ఎత్తేస్తారా?
మస్క్ తనను తాను సంపూర్ణంగా వాక్‌స్వాతంత్ర్యం కోసం పనిచేసే వ్యక్తిగా చెప్పుకొంటుంటారు. ట్విటర్ సంప్రదాయవాదుల గళాలను సెన్సార్ చేస్తుందని కొందరు యూజర్లు అంటుంటారు. ముఖ్యంగా అమెరికా రైట్ వింగ్ నుంచి ఇలాంటి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను ట్విటర్ ఎప్పటికప్పుడు ఖండిస్తుంటుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను ట్విటర్ నిషేధించింది. ఆ నిర్ణయం తప్పని మస్క్ గతంలో చెప్పడంతో పాటు తాను ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత ట్రంప్‌పై నిషేధాన్ని ఎత్తేస్తానని ప్రకటించారు. అయితే ట్విటర్ మస్క్ చేతికొచ్చాక మోడరేషన్ పాలసీలు కనుక సరళీకరిస్తే విద్వేష వ్యాఖ్యలు అక్కడ ఎక్కువ కావొచ్చన్న ఆందోళనలు చాలామంది నుంచి వ్యక్తమవుతున్నాయి.

 
కాగా ట్విటర్‌లో ప్రకటనకర్తలనుద్దేశించి మస్క్ చేసిన ఓ ట్వీట్‌లో ఆయన... ''ఈ ప్లాట్‌ఫాం పూర్తిగా నరకంగా ఏమీ మారిపోదు. అయితే, అందరికీ ఇక్కడ స్వాగతం ఉంటుంది'' అన్నారు. మరోవైపు మస్క్ ఇక ట్విటర్‌లో ఉద్యోగులను పెద్దఎత్తున తొలగిస్తారన్న ప్రచారం సాగుతోంది. అయితే, తానొస్తే 75 శాతం ఉద్యోగాలను తీసేస్తానంటూ జరుగుతున్న ప్రచారం కరెక్టు కాదని, అలాంటి ఆలోచన లేదని ఆయన ఉద్యోగులతో అన్నట్లు 'బ్లూమ్‌బర్గ్' వెల్లడించింది. అయితే, ట్విటర్‌లో పనిచేయడం ఇంతకుముందు కంటే ఇక భారం కావొచ్చని భావిస్తున్నారు. మస్క్ గతంలో చేసిన ట్వీట్లే దీనికి కారణం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments