Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ వ్యాక్సీన్ డ్రై రన్: దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లో

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (11:37 IST)
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్- 19 వ్యాక్సిన్‌ డ్రై రన్ ప్రారంభమైంది. మొత్తం 116 జిల్లాల్లోని 259 కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోనూ డ్రై రన్ ప్రారంభమైంది. నగరంలోని 3 ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. దిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో వ్యాక్సీన్ డ్రై రన్ కార్యక్రమాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్థన్ పరిశీలించారు.

 
డ్రై రన్ ఎందుకంటే..
వ్యాక్సీన్ పంపిణీ కోసం వ్యవస్థ సంసిద్ధంగా ఉందా లేదా అని చూసేందుకు డ్రై రన్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారో తెలుస్తుంది. వ్యాక్సీన్ పంపిణీకి సంబంధించి సౌకర్యాలు ఎలా ఉన్నాయన్నది కూడా అర్థమవుతుంది.

 
వ్యాక్సిన్‌ను నిల్వ చేసిన కేంద్రాల నుంచి పంపిణీ కేంద్రాలకు తరలించేందుకు ఎంత సమయం పడుతుంది? ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది కూడా తెలుస్తుంది. ఈ ప్రక్రియలో ఒక్కో టీకా కేంద్రంలో 25 మంది ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ -19 డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. దేశంలో ఇది రెండో దశ డ్రై రన్. మొదటి దశలో 2020 డిసెంబర్ 28న ఆంధ్రప్రదేశ్, అసోం, పంజాబ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో నిర్వహించారు.

 
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కోసం 96 వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీరిలో 2,360 మందికి నేషనల్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్‌లో శిక్షణ ఇవ్వగా, 57,000 మందికి పైగా సిబ్బంది 719 జిల్లాల్లో జిల్లా స్థాయి శిక్షణ పొందారని చెప్పింది.

 
వ్యాక్సీన్‌ను త్వరితగతిన పంపిణీ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు, లోపాలు ఉన్నా చెప్పాలని కేంద్ర మంత్రి హర్ష్ వర్ధన్ అన్ని రాష్ట్రాల అధికారులను కోరారు. ఏవైనా సమస్యలు ఉన్నట్టు ఈ డ్రై రన్‌లో గుర్తిస్తే, టీకా అందుబాటులోకి వచ్చేలోగా వాటిని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్‌ను తగ్గాల్సిందే అన్నది ఎవరు? స్పెషల్ స్టోరీ

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments