Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్: మాస్క్, ప్రొటెక్టివ్ గేర్ ఎవరికి అవసరం, ఇంట్లో చేసిన మాస్క్ సురక్షితమేనా?

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (13:51 IST)
ఫేస్ మాస్కులు, గ్లోవ్స్, ఇతర రక్షణ దుస్తులు అత్యవసర విధుల్లో ఉన్నవారికి కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి సహాయపడతాయి. ఇప్పుడు, కొందరు ఇళ్లలోనే మాస్కులు తయారు చేసుకుంటున్నారు. వాటిని బయట ఉపయోగించుకోవచ్చని అమెరికన్లకు సలహాలు కూడా ఇస్తున్నారు. కానీ అవి సురక్షితమేనా?
 
అందరూ మాస్కులు ఎందుకు వేసుకోరు?
ప్రస్తుతం రెండు రకాల ప్రజలు మాత్రమే ప్రొటెక్టివ్ మాస్క్ వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మిగతావారు మాస్కులు వేసుకోవాలని ఎవరూ చెప్పడం లేదు. ఎందుకంటే...
 
ఇతరులు దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు లేదంటే మాస్క్ తీస్తున్నప్పుడు, పెట్టుకుంటున్నప్పుడు అవి కలుషితం కావచ్చు. మాస్క్ వేసుకోవడం కంటే తరచూ చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం మంచిది. మనం సురక్షితంగా లేమనే తప్పుడు భావన ఎదుటివారికి కలగవచ్చు.
కరోనావైరస్ రోగులు మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా అది గాలిలో వ్యాపిస్తుంది. అవి పడి కలుషితమైన వస్తువులను ఎవరైనా తాకి, ఆ చేతులతో నేరుగా కళ్లు, ముక్కు, నోటిని తాకడం ద్వారా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. అయితే, మాస్కులు వేసుకోవడం వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం ఉండొచ్చు అని డబ్ల్యుహెచ్ఓ నిపుణులు ఇప్పుడు చెబుతున్నారు.
 
ఇంట్లో తయారు చేసే మాస్కులు పనిచేస్తాయా?
బహిరంగ ప్రాంతాల్లో ఉన్నప్పుడు శుభ్రమైన గుడ్డతో ముక్కు, నోరు కప్పుకోవాలని అమెరికన్లకు ఇప్పుడు చెబుతున్నారు. మెడికల్ మాస్కుల కొరత ఉందని, వాటిని ఆరోగ్య సిబ్బంది కోసం వదిలేయాలని అంటున్నారు.
 
ఇంతకు ముందు జబ్బు పడ్డవారు లేదా కరోనావైరస్ రోగులను చూసుకుంటున్నవారు మాత్రమే మాస్కులు వేసుకోవాలని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపించక తమకు తెలీకుండానే వైరస్ వ్యాప్తి చేస్తున్నవారిని ఈ కొత్త నియమాలతో అడ్డుకోవచ్చు అని అమెరికా అధికారులు భావిస్తున్నారు.
 
అయితే, వాడిన మాస్క్ మళ్లీ వాడొద్దని, వాటి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయని యూరోపియన్ నిపుణులు చెబుతున్నారు. గుడ్డలోంచి వైరస్ కణాలు చొచ్చుకెళ్లే అవకాశాలు ఎక్కువ. తేమ వల్ల వైరస్ గుడ్డలోనే నిలిచిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
బ్రిటన్ ప్రభుత్వం మెడికల్ లేదా ఇంట్లో తయారు చేసిన మాస్కులు వేసుకోమని తమ దేశంలో ప్రజలకు చెప్పలేదు. మాస్కుల ఉపయోగంపై తమ ప్రభుత్వం మెడికల్, సైంటిఫిక్ సలహాలను అనుసరిస్తోందని దేశ హెల్త్ సెక్రటరీ మాట్ హానకాక్ చెప్పారు.
 
“ఆరోగ్యంగా ఉన్నవారు మాస్కులు వేసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుందని మాకు అనిపించడం లేదు. దానికి సామాజిక దూరం పాటించడం ఇప్పుడు చాలా ముఖ్యం” అని ఇంగ్లండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ జొనాథన్ వాన్ టామ్ చెప్పారు.
 
ఇంత చెబుతున్నా, "మాస్కులు ఇంట్లో ఎలా తయారు చేయాలి" అనేదానిపై ఆన్‌లైన్‌లో ఎన్నో సలహాలు, సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని సైట్స్ అత్యుత్తమ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాయి. అయితే, మాస్కులు తగిన భద్రతా ప్రమాణాలను అందుకోవాలి కాబట్టి, ఇంట్లో తయారు చేసే వాటిని బయట ఉపయోగించడం మంచిది కాదు.
 
అత్యుత్తమ రకం మాస్క్ ఏది?
ఆస్పత్రుల్లో రకరకాల దశల్లో రక్షణ కోసం రకరకాల మాస్కులు ఉపయోగిస్తారు. వీటిలో అత్యంత సురక్షితమైనది FFP3. దీని బదులుగా N95 లేదా FFP2 ఉపయోగించవచ్చు. వీటికి గాలిని వడపోసే ఫిల్టర్స్ ఉంటాయి.
 
నిపుణులు వీటిని అందరికీ సూచించడం లేదు. కరోనావైరస్ రోగులకు దగ్గరగా ఉండి, గాల్లో వచ్చే తుంపర్లు పీల్చే ప్రమాదం ఉన్న హైరిస్క్ ఆరోగ్య సిబ్బంది మాత్రమే ఇవి ఉపయోగించాలి.
 
మిగతావారు అంటే తక్కువ రిస్క్ ఉండేవారు సర్జికల్ మాస్కులు ఉపయోగించవచ్చు. అంటే కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన రోగికి ఒక మీటర్ పరిధిలో ఉండే ఆరోగ్య సిబ్బంది ఇలాంటివి వేసుకోవాలి.
 
కరోనావైరస్ నుంచి వేరే ఏవి కాపాడగలవు?
కరోనావైరస్‌ ఉన్న చోట పనిచేసే ఆరోగ్య సిబ్బంది గ్లోవ్స్, ఇతర రక్షణ దుస్తులు కూడా వేసుకోవాలని చెబుతున్నారు. తప్పనిసరిగా వాటిని వాడాలని స్పష్టం చేస్తున్నారు. హైరిస్క్ పరిస్థితుల్లో పనిచేసే సిబ్బంది సింపుల్ ఆప్రాన్, గ్లోవ్స్, మాస్క్, గాగుల్స్ బదులు ఫుల్ ప్రొటెక్షన్ వేసుకోవాలని సూచిస్తున్నారు.
 
కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే..
తరచూ, బయట నుంచి ఇంట్లోకి వచ్చినపుడు కనీసం 20 సెకన్లపాటు మీ చేతులను సబ్బు, నీళ్లతో కడుగుతూ ఉండండి.
సబ్బు, నీళ్లు అందుబాటులో లేనపుడు చేతులు కడగడానికి శానిటైజర్ ఉపయోగించండి.
దగ్గు, తుమ్ము వచ్చినపుడు అర చేతుల్తో ముక్కు, నోరు కప్పుకోకుండా టిష్యూ లేదా మీ మోచేతిని ఉపయోగించండి.
వాడిన టిష్యూలను వెంటనే బిన్‌లో పడేసి, తర్వాత చేతులు కడుక్కోండి.
మీ చేతులు శుభ్రంగా లేకపోతే నోరు, ముక్కు, కళ్లు తాకకండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments