Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అయినా నాలో టెన్షన్ తగ్గలేదు’.. అనుష్కను చూసి కోహ్లీ ఎందుకంత టెన్షన్ పడ్డాడు?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (13:48 IST)
భారత్‌లో క్రికెట్, సినిమా.. రెండు మతాల్లాంటివని అంటుంటారు. ఈ రెండు రంగాలకున్న పాపులారిటీ అలాంటిది. అందుకే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిందీ సినీ తార అనుష్కశర్మల ప్రేమాయణం అప్పట్లో జనాలకు చాలా ఆసక్తికర అంశంగా ఉండేది. ఈ జంటను 'విరుష్క' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. దాదాపు నాలుగేళ్ల ప్రేమయాణం తర్వాత కోహ్లి, అనుష్క 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

 
తాజాగా 'ఇన్ డెప్త్ విత్ గ్రాహమ్ బెన్సింగర్' అనే అమెరికన్ టీవీ షోకు కోహ్లీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అనుష్కను తొలిసారి కలిసిన సందర్భంతోపాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అతడు ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నాడు. ఓ షాంపూ యాడ్ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో అనుష్కను తాను తొలిసారి కలిశానని కోహ్లీ చెప్పాడు.

 
''ఆ యాడ్ షూటింగ్ మూడు రోజులు జరిగింది. అనుష్కతో కలిసి ఆ యాడ్ చేయాల్సి ఉంటుందని నా మేనేజర్ వచ్చి చెప్పాడు. నాకు టెన్షన్ పట్టుకుంది. ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అయిన అనుష్క పక్కన నేనెలా చేయగలుగుతా అని మేనేజర్‌తో అన్నా. ఏం ఫర్వాలేదని, యాడ్ స్క్రిప్ట్ కూడా బాగుందని అతడు చెప్పాడు. అయినా, నాలో టెన్షన్ తగ్గలేదు'' అని అన్నాడు కోహ్లీ.

 
''అనుష్కను తొలిసారి కలవగానే టెన్షన్‌కు లోనయ్యా. ఆమె హీల్స్ వేసుకుని ఉంది. నా కంటే ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తోంది. నాపై నేనే ఓ చెత్త జోక్ వేసుకున్నా. దీంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నాలో గుబులు మరింత పెరిగింది'' అని వివరించాడు. తమ ఇద్దరి కెరీర్లు ఒకేసారి మొదలయ్యాయని, ఇద్దరం ఒకే తరహా కుటుంబాల నుంచి వచ్చామని కోహ్లీ చెప్పాడు. తమ పెళ్లి ఏర్పాట్లంతా అనుష్కనే దగ్గరుండి చూసుకుందని, తాను అప్పుడు ఓ క్రికెట్ సిరీస్ మధ్యలో బిజీగా ఉన్నానని వివరించాడు.

 
ఇటలీలో జరిగిన తమ వివాహ వేడుకకు కేవలం 42 మందిని పిలిచామని.. ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం, క్రికెటర్ల కోసం విడివిడిగా విందులు ఏర్పాటు చేశామని కోహ్లీ చెప్పాడు. తమ హనీమూన్ గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని కోహ్లీ ఈ టీవీ షోలో బయటపెట్టాడు. ''మమ్మల్ని గుర్తుపట్టేవారు ఎవరూ ఉండరని ఫిన్లాండ్‌కు వెళ్లాం. అక్కడ ఓ హోటళ్లో కాఫీ తాగుతూ, ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. 

 
పక్కనే ఓ టేబుల్‌ వద్ద తలపాగా పెట్టుకున్న వ్యక్తి కనిపించాడు. మేం అతడికి దూరంగా, కొంచెం లోపలకు ఉన్న టేబుల్ వైపు వచ్చి కూర్చున్నాం. కొద్ది సమయం తర్వాత ఆ వ్యక్తి కూడా మా దగ్గరికి వచ్చాడు. మమ్మల్ని చూడటం సంతోషం కలిగించిందని, తన ఇంటి పేరు కూడా కోహ్లీనేనని చెప్పాడు. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని చోటుకు ఎప్పటికి వెళ్తామో అని అప్పుడు నాకు అనిపించింది'' అని కోహ్లీ వివరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments