Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపోలో: చంద్రునిపై మనిషి కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు

Webdunia
మంగళవారం, 16 జులై 2019 (14:39 IST)
"మనిషికి ఇదొక చిన్న అడుగే కానీ, మానవాళికి గొప్ప ముందడుగు" చంద్రుని మీద కాలుమోపిన తర్వాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్న మాట ఇది. చంద్రుని మీద మానవుడు తొలిసారి కాలుమోపి యాభై ఏళ్లవుతోంది. 1969 జులై 20న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని మీద అడుగుపెట్టారు. శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయం అది. మన రోజువారీ జీవితంపై ప్రభావం చూపిన ఒక మైలురాయిగా అది నిలిచిపోయింది.
 
ప్రస్తుత కరెన్సీ విలువ ప్రకారం చూస్తే అపోలో ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు 200 బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది. ఆ ప్రాజెక్టు ఫలితం మరెన్నో విజయాలకు, ఆవిష్కరణలకు నాంది పలికింది. ఆ మిషన్ కోసం అభివృద్ధి చేసిన సాంకేతికత ప్రస్తుతం మనకు నిజజీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. అందులో కొన్నింటిని చూద్దాం.
 
1. వాక్యూమ్ క్లీనర్
బ్లాక్ అండ్ డెకర్ అనే అమెరికన్ సంస్థ 1961లో ఓ డ్రిల్లింగ్ పరికరాన్ని ఆవిష్కరించింది. అదే సంస్థ అపోలో స్పేస్‌క్రాఫ్ట్ కోసం నాసాకు ఒక ప్రత్యేక డ్రిల్‌ను తయారుచేసి ఇచ్చింది. ఆ డ్రిల్ కోసం ప్రత్యేక ఇంజిన్, బ్యాటరీలను రూపొందించడం ద్వారా పొందిన అనుభవంతో బ్లాక్ అండ్ డెకర్ సంస్థ ఆ తర్వాత పలు రకాల ఉపకరణాలను తీసుకొచ్చింది. అందులో 1979లో వచ్చిన తొలి కార్డ్‌లెస్ వాక్యూమ్ క్లీనర్ 'డస్ట్‌బస్టర్' ఒకటి. 30 ఏళ్లలో 15 కోట్ల డస్ట్‌బస్టర్ వాక్యూమ్ క్లీనర్లు అమ్ముడుపోయాయి.
 
2. ఆధునిక గడియారాలు
అపోలో లాంటి అంతరిక్ష ప్రాజెక్టులకు సమయంలో కచ్చితత్వం చాలా ముఖ్యం. ఎందుకంటే, ఒక్క సెకను అటు ఇటు అయినా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే, నాసాకు అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని సూచించే గడియారాలు అవసరమయ్యాయి. ఆ అవసరం కారణంగానే అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని సూచించే అత్యాధునిక గడియారాలు రూపుదిద్దుకున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అపోలో 11 మిషన్‌లో ఆర్మ్‌స్ట్రాంగ్ తోటి వ్యోమగామి, చంద్రుడిపై నడిచిన బజ్ ఆల్డ్రిన్ ధరించిన "పాత రకం" చేతి గడియారానికి భారీ ప్రాచుర్యం లభించింది.
 
3. శుభ్రమైన నీరు
అపోలో అంతరిక్ష నౌకలో ఉపయోగించిన నీటి శుద్దీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుతం నీటి వనరుల్లో బ్యాక్టీరియా, వైరస్‌లను, ఆల్గేలను చంపడానికి ఉపయోగిస్తున్నారు. అపోలో మిషన్‌ కారణంగా క్లోరిన్-ఫ్రీ నీటి శుద్ధీకరణ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీతో సిల్వర్ అయాన్లను నీటిలోకి పంపి బ్యాక్టీరియాను, ఆల్గేలను నశింపజేస్తారు. ఈ సాంకేతికతను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈత కొలనులు, నీటి ఫౌంటెయిన్లలో విస్తృతంగా వినియోగిస్తున్నారు.
 
4. మన్నికైన షూలు
చంద్రునిపై నడిచే సమయంలో అపోలో సిబ్బందికి రక్షణ కల్పించేందుకు 1965లో రూపొందించిన మోడల్ సూట్లనే ప్రస్తుత వ్యోమగాములు కూడా వినియోగిస్తున్నారు. అంతేకాదు, ఆ స్పేస్ సూట్ల తయారీ కోసం వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం బూట్ల తయారీలోనూ అనేక మార్పులకు ప్రేరణగా నిలిచింది. దాని ఫలితంగానే గత కొన్ని దశాబ్దాల కాలంలో అత్యంత సౌకర్యవంతమైన, మన్నికైన, చెమటను శోషించుకోగల బూట్లు మార్కెట్‌లోకి వచ్చాయి.
 
5. అగ్ని నిరోధక బట్టలు
1967లో నాసా శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో విమానంలోని ముగ్గురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అమెరికా అంతరిక్ష కార్యక్రమాన్ని గందరగోళానికి గురిచేసింది. కానీ, ఆ ఘటన తర్వాత నాసా అత్యాధునిక అగ్ని-నిరోధక దుస్తులను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆ రకం దుస్తులను విస్తృతంగా వినియోగిస్తున్నారు.
 
అప్పట్లో వ్యోమగాముల విశ్రాంతి కోసం వినియోగించిన శీతలీకరణ వ్యవస్థనే ప్రస్తుతం ప్రపంచమంతా వినియోగిస్తోంది. ప్రస్తుతం మల్టిపుల్ స్క్లెరోసిస్ రోగులతో సహా అందరికీ ఉపయోగపడుతోంది.
 
6. గుండె వైద్యం
గుండె ప్రమాదకరస్థాయిలో అసాధారణ వేగంతో కొట్టుకునేవారికి వైద్యం అందించేందుకు డీఫిబ్రిలేటర్స్ అనే పరికరాలను ప్రస్తుతం విరివిగా వాడుతున్నారు. అపోలో ప్రయోగ సమయంలో నాసా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఈ పరికరాలలో వాడుతున్నారు. మొదటిసారిగా 1980లలో ఈ పరికరాలు వాడుకలోకి వచ్చాయి.
 
7. ఆహార భద్రత
చంద్రుడి మీద కాలుమోపాలన్న తపనలో, స్పేస్ క్రాఫ్ట్‌లో స్థలాన్ని ఆదా చేసేందుకు, వాటిని వీలైనంత తేలికగా తయారు చేసేందుకు నాసా అనేక మార్గాల గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఆ క్రమంలో వ్యోమగాముల రక్షణ అవసరాలతో పాటు, వారు తినే ఆహారంపై కూడా పరిశోధనలు జరిగాయి.
 
అందుకు ఒక పరిష్కారం కనుగొన్నారు. అదే ఫ్రీజ్- డ్రైయింగ్ ప్రక్రియ. అందులో తాజాగా వండిన ఆహార పదార్థాల నుంచి చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నీరు బయటకు వెళ్లిపోయేలా చేస్తారు. ఆ తర్వాత ఆ పదార్థాలకు కాసిన్ని వేడి నీళ్లు కలిపి తినేయొచ్చు. ఈ విధానం అపోలో వ్యోమగాములకు ఎంతో ఉపయోగపడింది.
 
8. సర్వైవల్ బ్లాంకెట్
ఎండ నుంచి అపోలో స్పేస్‌క్రాఫ్ట్‌ విడిభాగాలను రక్షించేందుకు నాసా స్పేస్ బ్లాంకెట్‌ (షైనింగ్ ఇన్సులేటర్)ను వాడింది. ప్లాస్టిక్, ఫిల్మ్, అల్యూమినియంతో దానిని తయారు చేసింది. ప్రస్తుతం అత్యవసర సమయాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న సర్వైవల్ బ్లాంకెట్లు ఆ స్పేస్ బ్లాంకెట్‌ను స్ఫూర్తిగా తీసుకుని వాడుతున్నవే.
 
అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఈ కవర్లను చుడతారు. శరీరం నుంచి ఉష్ణం కోల్పోకుండా ఈ కవర్ కాపాడుతుంది. అంటే, నాసా సాంకేతిక పరిజ్ఞానం అత్యవసర దుప్పట్లను సృష్టించడానికి ఉపయోగపడింది. పరుగు పందేలు జరిగినప్పుడు కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. రోగులు, సిబ్బంది పరిస్థితులను మెరుగుపరచడానికి ఆసుపత్రుల్లోనూ సాంకేతికతను వినియోగిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాట్నా వేదికగా "పుష్ప-2" ప్రమోషన్ ఈవెంట్?

నా బరువు గురించి మీకెందుకయ్యా... నెటిజన్‌పై సమంత ఫైర్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments