Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘తెలంగాణలో 125 కరోనావైరస్ హాట్‌ స్పాట్లు, ఒక్క హైదరాబాద్‌లోనే 60’ : ప్రెస్ రివ్యూ

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (20:28 IST)
కరోనావైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకూ 125 ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గుర్తించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది. వీటి సంఖ్య ఇంకా పెరగొచ్చని పేర్కొంది. హైదరాబాద్‌లో 60 ప్రాంతాలను కరోనవైరస్ హాట్‌స్పాట్లుగా గుర్తించారు. నిజామాబాద్‌, కామారెడ్డి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్‌లోనూ ఇలాంటి ప్రాంతాలున్నాయి.
 
ఈ హాట్‌స్పాట్లలో ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ ముందు అనుకుంది. అయితే ఆయా ప్రాంతాల్లో వైరస్‌ సామూహికంగా వ్యాప్తి చెందకపోవడంతో ర్యాపిడ్‌ పరీక్షలు అవసరం లేదన్న నిర్ణయానికి చ్చింది. ర్యాపిడ్‌ పరీక్షల కిట్‌ల కోసం పెట్టిన ఇండెంట్‌ను రద్దు చేసినట్లు సమాచారం.
 
ఆ ప్రాంతాల్లో 3,500 వైద్య బృందాలను మోహరించారు. కరోనా తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో 60 వేల ఇళ్లను గుర్తించారు. మొత్తం 3.50 లక్షల మందిని పరీక్షించారు. ఇంటింటికి వెళ్లి వారికేమైనా ప్రయాణ చరిత్ర ఉందా? కరోనా పాజిటివ్‌ వ్యక్తులను కలిశారా? వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వైరస్‌ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? తదితర వివరాలు సేకరించారు.
 
రాష్ట్రంలో బుధవారం సాయంత్రం వరకు 454 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధిక కేసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఒక ప్రాంతంలో 5-6 కేసులు నమోదైతే దాన్ని హాట్‌స్పాట్‌గా వైద్య ఆరోగ్య శాఖ గుర్తిసోంది. కొన్నిచోట్ల రెండు మూడు కేసులు నమోదైనా హాట్‌స్పాట్లుగా గుర్తించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments