Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం.. పచ్చికందులను సూప్‌ల్లో వేసుకుని తింటే..?

పచ్చికందులను తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. ఇవి రక్తవృద్ధిని పెంచుతాయి. గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఈ గింజల్లో పుష్కలంగా ఉండే ఫోలిక్‌యాసిడ్‌ గర్భిణీలకు ఉపయోగపడుతుంది. కంది గింజల్లో తే

Webdunia
శనివారం, 14 జులై 2018 (11:02 IST)
పచ్చికందులను తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. ఇవి రక్తవృద్ధిని పెంచుతాయి. గుండె జబ్బులను దూరం చేస్తాయి. ఈ గింజల్లో పుష్కలంగా ఉండే ఫోలిక్‌యాసిడ్‌ గర్భిణీలకు ఉపయోగపడుతుంది. కంది గింజల్లో తేమ అధికంగా వుంటుంది. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, పీచుపదార్ధాలు, ఖనిజలవణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 
 
మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, కాపర్‌, క్యాల్షియం, ఐరన్‌, జింక్‌ వంటి ధాతువులు అధికం. పచ్చి కందుల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్‌ కణాలపై పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో పచ్చి కందులను తీసుకోవడం ద్వారా జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చు. 
 
ఎండిన కందిపప్పుతో చేసే వంటకాలు తింటూనే ఉన్నా తాజాగా లభించే పచ్చి కందులు రుచిలోనే కాదు పోషకాల పరంగాను బోలెడు ప్రయోజనాలు అందిస్తాయి. మామూలు కందిపప్పుతో పోలిస్తే పచ్చి కందికాయల నుంచి 25 శాతం ఎక్కువ పోషకాలు అందుతాయి. వేడివేడిగా ఉడకబెట్టుకుని తినడం వల్ల ముఖ్యంగా దగ్గు, ఛాతీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
లేదంటే పప్పుతో పాటూ సూపుల్లో వేసుకుని తింటే రుచిగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పనీర్‌తో కలిపి మసాలా కూరలు కూడా వండుకుంటారు. ఇలా పచ్చి కందులను వర్షాకాలంలో, శీతాకాలంలో వంటల్లో  చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments