Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిప్పతీగతో ప్రయోజనాలు ఏమిటి? ఎవరు తీసుకోరాదు?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (23:38 IST)
ఆయుర్వేదంలో వాడే తిప్పతీగతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రస్తుతం ఒత్తిడి అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి గురి అవుతుంటారు. ఇలా ఒత్తిడిని తొలగించడానికి తిప్పతీగ అద్భుతంగా పని చేస్తుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడమే కాక మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది.

 
సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈమధ్య కాలంలో కీళ్లవాపుల బారిన పడుతున్నారు. కీళ్లు వాపులకు గురవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. తిప్పతీగలో యాంటీ ఆర్థరైటిస్ గుణాలు ఉంటాయి. కనుక ఈ సమస్య ఉన్నవారికి నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

 
తిప్పతీగలో ఉండే ఆల్కలాయిడ్లు, లాక్టేన్లు అనబడే బయో యాక్టివ్ సమ్మేళనాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. బాడీలో షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది. అలాగే శ్వాస సమస్యలకు తిప్పతీగ అద్భుతంగా పని చేస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండటం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. తిప్పతీగలో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

 
డయాబెటిస్ వల్ల మన దేశంలో అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. ఈమధ్యకాలంలో ఇది సర్వసాధారణమైన రోగంగా మారింది. అయితే తిప్పతీగను నిత్యం తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. తిప్పతీగ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఫ్లూ, ఇతర వైరల్ జ్వరాలకు కూడా తిప్పతీగను వాడవచ్చు. తిప్పతీగ శరీర రోగ నిరోధక శక్తిని పెంచి విష జ్వరాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఐతే తిప్పతీగను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తీసుకోరాదని ఆయుర్వేదం చెపుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments