తంగేడు పువ్వుల పేస్టుంటే చాలు.. బ్యూటీపార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు..

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (14:48 IST)
తంగేడు పువ్వులు ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. గుప్పెడు తంగేడు పువ్వులను బాగా పేస్టు చేసుకుని ఎండలో ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఆ నూనెను తలకు పట్టించడం ద్వారా చుండ్రు సమస్య వుండదు. హెయిర్ ఫాల్ వుండదు. జుట్టు వత్తుగా పెరుగుతుంది. చర్మం సౌందర్యం పెంపొందుతుంది. 
 
ముఖంపై వున్న మచ్చలను తంగేడు పువ్వుల పేస్టు తొలగిస్తుంది. అందుకే తంగేడు పువ్వులను బాగా పేస్టు చేసుకుని ముఖానికి రోజుకోసారి పట్టిస్తే బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం వుండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
తంగేడు పువ్వులను, వెల్లుల్లిపాయలతో కలిపి కాస్త పప్పు చేర్చి వండుకుని వారానికి ఓసారి తింటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. తంగేడు పువ్వులను గ్లాసుడు నీటిలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అంతేకాదు.. మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. 
 
హెయిర్ ఫాల్ సమస్య వుంటే.. తంగేడు పువ్వులు, మందార పువ్వులు, కొబ్బరి పాలును సమపాళ్లలో తీసుకుని బాగా పేస్టులా చేసి శిరోజాలకు పట్టించాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడు ఎవరు? 20న ఎంపిక

అబద్దాల కోరు పాకిస్థాన్... కాశ్మీర్ విషయంలో నోర్మూసుకుని కూర్చొంటే మంచింది...

హోటల్ గదిలో భార్యతో ఆమె ప్రియుడు, పట్టుకున్న భర్త, సరే విడాకులు తీసుకో అంటూ షాకిచ్చిన భార్య

Roja: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ఆర్కే రోజా... మాటలకు, చేతలకు సంబంధం లేదు

పురుషులు గర్భందాల్చుతారా? భారత సంతతి వైద్యురాలికి వింత అనుభవం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్

ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్న ధనుష్, మృణాల్ ఠాకూర్?

Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్

Sai Durga Tej: పంచె కట్టు ధరించిన సాయి దుర్గతేజ్.. సంబరాల ఏటిగట్టు లుక్

రణధీర్ భీసు-హెబ్బా పటేల్ జంటగా మిరాకిల్ సంక్రాంతి లుక్

తర్వాతి కథనం
Show comments