Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిలకడ దుంపల్లో వున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసా?

చిలకడ దుంపల్లో వున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటో తెలుసా?
, శనివారం, 1 డిశెంబరు 2018 (21:16 IST)
సాధారణంగా మనం రకరకాల దుంపలను తింటూ ఉంటాం. వీటిలో చిలకడదుంప చాలా ప్రధానమైనది. చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
 
1. బంగాళదుంప, కందగడ్డల్లో కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి.
 
2. చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.
 
3. ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగా ఉంటుంది.
 
4. చిలగడదుంపల్లో విటమిన్‌ ఏ లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.
 
5. పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి. వీటిల్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచితే.. విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.
 
6. చిలగడదుంపల్లో ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గింజ పట్టని లేత నల్లతుమ్మ కాయలను ఎండించి చూర్ణం చేసి పురుషులు తీసుకుంటే?