Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువును నియంత్రణలో ఉంచే పచ్చి బఠానీ

Advertiesment
బరువును నియంత్రణలో ఉంచే పచ్చి బఠానీ
, శనివారం, 1 డిశెంబరు 2018 (11:28 IST)
పచ్చి బఠాణీలో పోషక నిల్వలు ఉన్న విషయం తెలియకుండానే ఎందరో భోజన ప్రియులు వీటిని ఇతర కూరగాయలతో ఉడికించుకుని తింటున్నారు. ఆలు, పన్నీర్‌, మటన్‌ ఇలా రకరకాల కూరల్లో, బిర్యానీలోనూ కలిపి వండడం బాగా పెరిగింది. బఠాణీ సూప్‌ కూడా చాలా మంది ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. 
 
పచ్చి బఠానీల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఒక కప్పు ఉడకబెట్టిన పచ్చి బఠానీలను తింటే అంత త్వరగా ఆకలి కాదు. దీని వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా అధిక బరువు త్వరగా తగ్గుతారు. దీనికి తోడు పచ్చి బఠానీల వల్ల క్యాలరీలు కూడా చాలా తక్కువగా లభిస్తాయి. బరువు నియంత్రణలో ఉంటుంది.
 
పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సి, ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కంటి సమస్యలు, రక్తహీనత ఉండవు. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఎదిగే పిల్లలకు పచ్చి బఠానీలను పెట్టాలి. ఇవి వారికి బలవర్దకమైన ఆహారంగా పనిచేస్తాయి. పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే వీటిని అతిగా మాత్రం తినడం వల్ల గ్యాస్ ఇబ్బంది కలుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెన్నునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఇవి తినండి..