Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిరియాల పొడి, టమోటాతో గొంతునొప్పి..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (14:36 IST)
ప్రతి వంటిట్లో మిరియాల, మిరియాల పొడి తప్పనిసరిగా ఉంటుంది. వీటిని మనం తయారుచేసే కూరలలో వేసుకుంటే చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. ఇవి అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. మిరియాలలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే వీటిని అసలు విడిచి పెట్టరు. శరీరంలోని కొవ్వును తగ్గించాలనుకునే వారు మిరియాలను వేయించి పొడిచేసుకుని నీటిలో మరిగించి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  
 
గొంతునొప్పిగా ఉన్నప్పుడు పాలలో కొద్దిగా మిరియాల పొడి, తేనె, చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. మిరియాలలోని విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్ వంటి పదార్థాలు దగ్గు, జలుబు వంటి సమస్యలను తొలగిస్తాయి. మిరియాల పొడిలో కొద్దిగా శొంఠి పొడి, తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు సేవిస్తే దగ్గు, జలుబుల తగ్గుతుంది. 
 
ఒక గిన్నెలో నీరుపోసి ఈ నీటిలో మిరియాల పొడి, ఉప్పు, ఇంగువ, పసుపు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాకాకుంటే బాణలిలో నూనెను వేసుకుని వేడయ్యాక టమోటా ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించి నీరుపోసి కాసేపటి తరువాత మిరియాల పొడి వేసి బాగా కలిపి మరికాసేపు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తీసుకుంటే బాగుంటుంది. జలుబు వెంటనే తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

'ఆర్ఆర్ఆర్‌'కు చిత్రహింసలు.. విజయపాల్ డొంకతిరుగుడు సమాధానాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

డేంజర్ లో వున్న రాబిన్‌హుడ్ లైఫ్ లోకి శ్రీలీల ఎంట్రీతో ఏమయింది?

భైరవంలో అందమైన వెన్నెలగా అదితి శంకర్‌ పరిచయం

సాయి శ్రీనివాస్‌, దర్శకుడు విజయ్‌ విడుదల చేసిన టర్నింగ్‌ పాయింట్‌ లుక్‌

కొత్త సీసాలో పాత కథ వరుణ్ తేజ్ మట్కా మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments