Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెర్రి పుచ్చ వేర్లుతో ఊడిపోయిన వెంట్రుకలు మొలుస్తాయి, ఎలాగంటే?

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (23:30 IST)
వెర్రి పుచ్చచెట్టు. పొలాల్లో, రోడ్ల వెంట ఇది కనబడుతుంది. ఏదో పిచ్చి చెట్టు అనుకుంటారు కానీ ఇందులో వున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెర్రి పుచ్చతో ఆరోగ్యానికి కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాము. వెర్రి పుచ్చ వేరు పొడిని లేదా కాయల పొడిని అత్యల్పంగా తీసుకుని పుచ్చుపన్ను లోపల పెడితే నొప్పి తగ్గి క్రిములు చచ్చిపోతాయి. చేదు పుచ్చకాయ కఫ రోగాలను, ప్రేవులలో క్రిములను, వ్రణాలతో పాటు పొట్టలోని జబ్బులను తగ్గించగలదు.
 
వెర్రి పుచ్చ ఆకును దంచి రసం తీసి, దానికి పసుపు కలిపి లేపనం చేస్తుంటే అనేక రకాల చర్మవ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి. వెర్రి పుచ్చ వేరు, దేవదారు చెక్కలను మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని గొంతుపై లేపనం చేస్తే గొంతుగడ్డలు తగ్గుతాయి. చేదు పుచ్చ వేర్లు, పిప్పలికట్టె, బెల్లం సమంగా కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని పేనుకొరుకుడు పైన రెండుపూటలా మర్దిస్తే తిరిగి వెంట్రుకలు వస్తాయి.
 
వెర్రి పుచ్చ వేరును గంజినీటితో అరగదీసి ఆ గంధాన్ని రెండుచుక్కలు ముక్కుల్లో వేస్తే అపస్మారం నుంచి కోలుకుంటారు. కీళ్ల నొప్పులను తగ్గించే శక్తి వెర్రిపుచ్చకు వుంది. ఐతే వెర్రిపుచ్చకు, పిప్పళ్లపొడి, పాతబెల్లం కలిపి మాత్రలు తయారు చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments